IND vs ENG 4th Test Day 1 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 53/3

Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Sep 03, 2021 | 6:17 AM

India vs England 4th Test Day 1 Highlights: భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా నేడు ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, ఇంగ్లండ్ టీంలు 1–1తో సమంగా నిలిచాయి.

IND vs ENG 4th Test Day 1 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 53/3
India Vs England 2021

India vs England 2021: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఓవల్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. తొలిరోజు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటగా ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియాను 191 పరుగులకే కట్టడి చేయగా.. ఆ తరువాత భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ల 3 వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు కెప్టెన్ జో రూట్‌ సహా మూడు వికెట్లు సమర్పించుకుంది. ఆతిథ్య జట్టుపై భారత్ 138 పరుగుల ఆధిక్యంల ఉంది. రెండవ రోజు డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు. ఇక 46 బంతులాడిన మలన్.. 26 పరుగులు చేశాడు. 8 బంతులాడిన క్రెయిడ్ ఓవర్టన్ 1 పరుగు చేశాడు. రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, జో రూట్ అవుట్ అయ్యారు.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బౌండరీలతో కొద్దిసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దుల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శార్దుల్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్‌సన్ 3, అండర్ సన్, క్రిగ్ తలో వికెట్ పడగొట్టారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 02 Sep 2021 11:32 PM (IST)

    ముగిసిన మొదటి రోజు ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 53/3..

    భారత్-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. బూమ్రా వేసిన చివరి ఓవర్‌ను ఓవర్టన్ ఫేస్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 53 పరుగులు చేసింది.

  • 02 Sep 2021 11:28 PM (IST)

    ఇంగ్లండ్‌కు భారీ షాక్.. రూట్ వికెట్ పడగొట్టిన ఉమేష్..

    ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడో వికెట్‌ కోల్పోయింది. జో రూట్ అవుట్ అయ్యాడు. సిరాజ్ స్థానంలో బౌలింగ్ చేయడానికి వచ్చిన ఉమేష్.. రెండో స్పెల్ మూడో బంతికి రూట్‌ను బౌల్డ్ చేశాడు. ఉమేష్ వేసిన బంతి ఆఫ్ స్టంప్‌ తాకింది. దాంతో ఉమేష్ ఖాతాలో తొలి వికెట్ పడినట్లయ్యింది.

  • 02 Sep 2021 10:54 PM (IST)

    రాణిస్తున్న రూట్, మలన్.. ఇంగ్లండ్ స్కోర్ 52/2..

    నాల్గవ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన తరువాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా.. వేగంగా స్కోర్ చేస్తోంది. 15 ఓవర్లు పూర్తయ్యే నాటికి ఇంగ్లాండ్ 52 పరుగులు పూర్తి చేసింది. రూట్, మలాన్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Sep 2021 10:35 PM (IST)

    ఉమేష్ యాదవ్‌ బౌలింగ్.. ఫోర్ బాదిన రూట్..

    భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్ ఉమేష్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అయితే, లెగ్ స్టంప్‌ వేయడంతో.. రూట్ ఆ బంతిని సునాయసంగా బౌండరీకి పంపాడు. మిడ్‌వికెట్‌పై బంతి ఫోర్ బౌండరీకి చేరింది.

  • 02 Sep 2021 10:05 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ టీం 4 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి రోరే బర్న్స్‌‌ను బోల్తా కొట్టించిన బుమ్రా.. చివరి బంతికి హసీబ్ హమీద్‌‌ను పెవిలియన్ చేర్చాడు ఇంగ్లండ్ స్కోర్ 6/2, డేవిడ్ మలాన్ 1, రూట్ 0

  • 02 Sep 2021 10:01 PM (IST)

    ఇంగ్లండ్‌కు తొలిదెబ్బ

    తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రోరే బర్న్స్‌ను పెవిలియన్‌కు బుమ్రా తన పదునైన బాల్‌తో బోల్తాకొట్టించాడు. దీంతో ఇంగ్లండ్ టీం 5 పరుగులకు తొలి వికెట్ కోల్సోయింది.

  • 02 Sep 2021 09:45 PM (IST)

    మొదలైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్

    టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ టీం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా రోరే బర్న్స్, హసీబ్ హమీద్ బరిలోకి దిగారు.

  • 02 Sep 2021 09:36 PM (IST)

    191 పరుగులకు టీమిండియా ఆలౌట్

    భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బౌండరీలతో కొద్దిసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దుల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శార్దుల్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్‌సన్ 3, అండర్ సన్, క్రిగ్ తలో వికెట్ పడగొట్టారు.

  • 02 Sep 2021 09:28 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

    టీమిండియా ఇన్నింగ్స్‌ను బౌండరీలతో మోత మోగించిన శార్దుల్ ఠాకూర్(57) పెవిలియన్ చేరాడు.

  • 02 Sep 2021 09:22 PM (IST)

    సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేసిన శార్దుల్

    శార్దుల్ ఠాకూర్ ప్రతీ ఓవర్లో బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. 60వ ఓవర్లో సిక్స్, 4 తో సహా మొత్తం 13 పరుగులు సాధించారు. దీంతో శార్దుల్ సిక్స్‌తోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీమిండియా స్కోర్185/7, శార్దుల్ 53, యాదవ్ 9

  • 02 Sep 2021 09:16 PM (IST)

    మరో సిక్స్ బాదిన ఠాకూర్

    శార్దుల్ ఠాకూర్ బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోతున్నాడు. 59 ఓవర్లోనూ సిక్స్, ఫోర్‌ తో సహా 12 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోర్ 172/7, శార్దుల్ 43, యాదవ్ 9

  • 02 Sep 2021 09:10 PM (IST)

    మరోసారి వరుస ఫోర్లు బాదిన శార్థుల్ ఠాకూర్

    57 ఓవర్లో శార్థుల్ ఠాకూర్ మరోసారి రెండు ఫోర్లు బాదాడు. వోక్స్ వేసిన ఈ ఓవర్లో మూడు, ఆరు బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోర్ 154/7, ఠాకూర్ 31, యాదవ్ 0

  • 02 Sep 2021 09:05 PM (IST)

    150 పరుగులకు చేరిన భారత్ స్కోర్

    శార్ధుల్ ఠాకూర్ దూకుడుతో టీమిండియా స్కోర్ 150 పరుగులకు చేరింది. వరుసగా ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ భారత్‌ స్కోర్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీమిండియా స్కోర్ 154/7, శార్ధుల్ 31, యాదవ్ 0

  • 02 Sep 2021 09:00 PM (IST)

    సిక్స్ కొట్టిన ఠాకూర్

    55 ఓవర్లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు సాధించిన శార్దుల్.. 56 ఓవర్లో తొలి బంతిని సిక్స్ కొట్టాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ నమోదైంది.

  • 02 Sep 2021 08:57 PM (IST)

    వరుస ఫోర్లతో చెలరేగిన శార్ధుల్ ఠాకూర్

    55 ఓవర్లో శార్థుల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు, సింగిల్స్‌తో 3 పరుగులు సాధించాడు. వోక్స్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోర్ 145/7, ఠాకూర్ 22, యాదవ్ 0

  • 02 Sep 2021 08:49 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    పంత్(9) రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ను కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 127 వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోర్ 128/7, ఠాకూర్ 5, ఉమేష్ యాదవ్ 0

  • 02 Sep 2021 08:21 PM (IST)

    టీ బ్రేక్.. 122/6

    తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం చూపించి భారత బ్యాట్స్‌మెన్లనను తెగ ఇబ్బంది పెట్టారు. వెంట వెంటనె రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. అనంతరం రెండో సెషన్‌లో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ అర్థ శతకంతో కాస్త ఇంగ్లండ్‌పై పైచేయి సాధించేలా కనిపించింది. కానీ, అనంతరం మరలా వికెట్లు కోల్పోతూ చిక్కుల్లో పడింది. రెండో సెషన్ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 4, ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. మరి మూడో సెషన్‌లో భారత్‌ ఆలౌట్ కాకుండా ఆడుతుందా లేదో చూడాలి.

  • 02 Sep 2021 08:14 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    రహానే (14) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. క్రిగ్ బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోర్ 122/6, పంత్ 4, ఠాకూర్ 4 బ్యాటింగ్

  • 02 Sep 2021 07:38 PM (IST)

    విరాట్ ఔట్

    హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. 42.3 ఓవర్లో రాబిన్ సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అర్థ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విరాట్ మరోసారి విఫలమయ్యాడు. టీమిండియా స్కోర్ 105/5

  • 02 Sep 2021 07:25 PM (IST)

    హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ

    సిరీస్‌లో టీమిండయా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. 40వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో 50పరుగులకు చేరుకున్నాడు. 89 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, రెండో సెషన్‌పై భారత్ పట్టు సాధించేందుకు సహాయపడ్డాడు.

  • 02 Sep 2021 07:17 PM (IST)

    100 పరుగులకు చేరిన భారత్

    రెండో సెషన్‌లో టీమిండియా కొద్దిగా నిలదొక్కుకున్నట్లే అనిపిస్తోంది. నిలకడగా ఆడుతున్న కోహ్లీ.. రహానెతో కలిసి స్కోర్ బోర్డును 100 పరుగులకు చేర్చాడు. విరాట్ కూడా సిరీస్‌లో తన రెండవ హాఫ్ సెంచరీవైపు అడుగులు వేస్తున్నాడు. టీమిండియా స్కోర్ 100/4, కోహ్లీ 45, రహానె 5

  • 02 Sep 2021 06:37 PM (IST)

    లంచ్ తరువాత జడేజా ఔట్

    లంచ్ తరువాత ఆట మొదలైన కొద్ది సేపటికే జడేజా(10) రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టన్ జోరూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా స్కోర్ 70/4, కోహ్లీ 24, రహానె 0

  • 02 Sep 2021 05:42 PM (IST)

    లంచ్ బ్రేక్

    తొలి సెషన్ ముగిసే సరికి టీమిండియా 54/3 పరుగులతో నిలిచింది. విరాట్ కోహ్లీ 18, జడేజా 2 నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లు రోహిత్ 11, రాహుల్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, రాబిన్సన్, క్రిస్ వోక్స్ తలో వికెట్ పడగొట్టారు. 25 ఓవర్ల తొలి సెషన్‌లో మొత్తం 12 మెయిడిన్లను ఇంగ్లండ్ బౌలర్లు సంధించారు. మొత్తంగా తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

  • 02 Sep 2021 05:11 PM (IST)

    పుజారా ఔట్

    టీమిండియా కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. వరుసగా వికెట్లు కోల్పోతూ లీడ్స్ టెస్టు మాదిరిగానే అత్యల్ప స్కోర్‌కే చెతులెత్తేసేలా కనిపిస్తున్నారు. 20 ఓవర్లో పుజారా(4) అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 02 Sep 2021 05:04 PM (IST)

    తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం

    ఓవల్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి సెషన్‌లో బౌలర్లు పదునైన బంతులతో భారత్ బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెంచుతున్నారు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ 11, రాహుల్ 17 వెంటవెంటనే పెవిలియన్ చేరారు. మొత్తం 10 ఓవర్లు మెయిడిన్‌గా నమోదుకావడం విశేషం. రాబిన్‌సన్ 6, వోక్స్ 4 మెయిడిన్లతో తలో వికెట్ సాధించడం విశేషం. అయితే అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం ప్రతీ ఓవర్లో పరుగులు సాధిస్తున్నారు.

  • 02 Sep 2021 04:52 PM (IST)

    కొనసాగుతోన్న మెయిడిన్ ఓవర్లు

    టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించేందుకు తెగ కష్టాలు పడుతోంది. ఇంగ్లండ్ బౌలర్ల దూకుడితో భారత బ్యాట్స్‌మెన్స్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 8 ఓవర్లు మెయిడిన్లుగా నమోదయ్యాయి.

    టీమిండియా స్కోర్ 34/2, పుజారా 4, కోహ్లీ 0

  • 02 Sep 2021 04:42 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా వికెట్ల పతకం కొనసాగుతూనే ఉంది. 14 వ ఓవర్లో రాబిన్స్ బౌలింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (17) ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 02 Sep 2021 04:27 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    తొమ్మిదొవ ఓవర్లో రోహిత్(11) పెవిలియన్ చేరాడు. వోక్స్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

  • 02 Sep 2021 03:45 PM (IST)

    వరుసగా రెండు ఫోర్లు

    మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ తొలి రెండు బంతులను బౌండరీలకు తరలించాడు. అండర్సన్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు.

    టీమిండియా స్కోర్: 9/0, రోహిత్ 1, రాహుల్ 8 బ్యాటింగ్

  • 02 Sep 2021 03:41 PM (IST)

    స్వదేశంలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు

    95 జేమ్స్ ఆండర్సన్* 94 సచిన్ టెండూల్కర్ 92 రికీ పాంటింగ్ 89 అలెస్టర్ కుక్ 89 స్టీవ్ వా 88 జాక్వెస్ కాలిస్

  • 02 Sep 2021 03:35 PM (IST)

    మొదలైన టీమిండియా బ్యాటింగ్

    టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.

  • 02 Sep 2021 03:18 PM (IST)

    టీమిండియాలో రెండు మార్పులు

    ఇషాంత్ శర్మ, షమీలను తప్పించి శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్‌లను తీసుకున్నారు. కాగా, అశ్విన్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.

  • 02 Sep 2021 03:06 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

    ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), ఒల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో (కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్

  • 02 Sep 2021 03:05 PM (IST)

    టాస్ గెలిచిన ఇంగ్లండ్

    ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Published On - Sep 02,2021 3:03 PM

Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?