ఈ తెగలో వింత ఆచారం..! కూతురి పెళ్లి చేస్తే వరకట్నంగా 21 విష సర్పాలు.. ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరగుతుందో తెలుసా..
కూతురి పెళ్లి చేస్తే తండ్రి అల్లుడికి కట్న కానుకలు సమర్పిస్తాడు.. డబ్బు, నగలు, కార్లు, బైకులు వంటి విలాసవంతమైన వస్తువులను కట్నంగా
కూతురి పెళ్లి చేస్తే తండ్రి అల్లుడికి కట్న కానుకలు సమర్పిస్తాడు.. డబ్బు, నగలు, కార్లు, బైకులు వంటి విలాసవంతమైన వస్తువులను కట్నంగా అందిస్తాడు. కానీ మద్యప్రదేశ్‌లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వందశాతం నిజం. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఈ సంప్రదాయాన్ని భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని గౌరియా సమాజ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లనిచ్చిన మామగారు తన అల్లుడికి మొత్తం 21 విష సర్పాలను కట్నంగా బహూకరిస్తాడు. ఈ సంప్రదాయం ఈ సమాజంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ వర్గానికి చెందిన వ్యక్తి తన కుమార్తెకు వివాహంలో పాము ఇవ్వకపోతే ఆ వివాహం వీగిపోతుందని వారు విశ్వసిస్తారు.
కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. వాటిలో చాలా విష సర్పాలు ఉంటాయి. అంతేకాదు ఈ తెగకు చెందిన పిల్లలు ఆ విషపూరిత పాములకు అస్సలు భయపడరు. అంతేకాదు వారు వాటితో హాయిగా ఆడుకుంటారు కూడా. ఇప్పటికీ కుమార్తెకు 21 పాములను కట్నంగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఎందుకంటే ఈ తెగ ప్రధాన పని పాములను పట్టుకోవడం.
గౌరియా సమాజంలోని ప్రజలు పాముల ద్వారా మాత్రమే డబ్బు సంపాదిస్తారు. గౌరియా సమాజంలో కుమార్తె వివాహం కుదిరాక బాలిక తండ్రి విష పాములను సేకరించడం ప్రారంభిస్తాడు. పాములను కుమార్తె తండ్రి అల్లుడికి ఇస్తాడు. వాటితో అతను కుటుంబాన్ని పోషిస్తాడు. ఈ తెగలోని ప్రజలు తమ ఇంటి సభ్యుల మాదిరిగా పాములను పెంచుతారు. ఒకవేళ వారి పెట్టె నుంచి ఒక పాము చనిపోతే ఆ కుటుంబంలోని సభ్యులందరూ బాధపడుతారు. అంతేకాకుండా పాము పేరిట ఒక విందు కూడా నిర్వహించాలి. ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వీరు పాములకు ఎటువంటి హాని కలిగించరు.