Mysterious Village: భూమిపైనే అల్లంత దూరాన మేఘాల్లో గ్రామం.. వర్షం చుక్క ఎరుగని ఊరు.. ఇదెక్కడంటే..!?
మన భూగ్రహం పై అనేక రహస్యాలు ఉన్నాయి. ధరణిపై ఎన్నో విచిత్రాలు, వింతలు అనేకం ఉన్నాయి. అలాగే భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరం ఉంటుంది.
మన భూగ్రహం పై అనేక రహస్యాలు ఉన్నాయి. ధరణిపై ఎన్నో విచిత్రాలు, వింతలు అనేకం ఉన్నాయి. అలాగే భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరం ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగానే మార్పులు జరుగుతుంటాయి. ఎండకాలంలో ఎండలు అధికంగా.. మరికొన్ని చోట్లు వర్షాలు ఎక్కువగా పడుతుండటం జరుగుతుంది. అయితే ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదట. అక్కడ ఉదయం పూట ఎండ.. రాత్రి పూట చలి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వర్షపు చినుకులు ఆ ప్రాంతాన్ని తాకలేదట. ఎందుకంటే ఆ గ్రామం మేఘాల పైన ఉంటుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది నిజం.. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందామా.
యెమెన్ రాజధాని సనా పరిధిలో ఉన్న చిన్న గ్రామం “అల్ హుతైబ్”. ఈ గ్రామం భూమి నుంచి 3,200 మీటర్ల ఎత్తులో ఓ పెద్ద కొండపై ఉంది. అయితే అక్కడ వర్షం మాత్రం పడలేదు. ఇందుకు కారణం ఆ ఊరు మేఘాలకు పైనా ఉండటమే. అంటే మేఘాలను దాటుకుని.. ఎత్తులో ఉన్న గ్రామం. అయితే మేఘాలు లేకపోతే వర్షం పడలేదు కదా.. మేఘాల పైనే ఆ ఊరు ఉండడం వలన వర్షం పడట్లేదు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఎత్తయిన కొండపై ఉన్న గ్రామంలో నిలబడి మేఘాల నుంచి వర్షం భూమిపై పడే అద్భుతమైన దృశ్యాలను.. మంచు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువే. అయితే పగటి సమయంలో అంటే సూర్యుడు ఉన్నంతసేపు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇక సూర్యుడు అస్తమించగానే చలి మొదలవుతుంది. మరుసటి రోజు సూర్యుడు వచ్చే వరకు చలి చంపుతుందట. ఆ గ్రామంలో ఎక్కువగా ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన కట్టడాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ అల్ బోహ్రా లేదా అల్ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరింతా ముంబయికి చెందిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ముస్లిం విభాగం నుంచి ఇక్కడ స్థిరపడిపోయారట. వీరిని యెమిని కమ్యూనిటీస్ అంటుంటారు.