AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poisonous Tree: ఈ చెట్టు పండ్లను తింటే అంతే సంగతులు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన వృక్షం.!

విషపూరిత గాలి, విషపూరితమైన నీరు, ఎక్కడ చూసినా గాలి కాలుష్యం. ఇది ప్రస్తుత పరిస్థితిని అద్దం పడుతుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే..

Poisonous Tree: ఈ చెట్టు పండ్లను తింటే అంతే సంగతులు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన వృక్షం.!
Leaf
Ravi Kiran
|

Updated on: Jul 07, 2021 | 12:13 PM

Share

విషపూరిత గాలి, విషపూరితమైన నీరు, ఎక్కడ చూసినా గాలి కాలుష్యం. ఇది ప్రస్తుత పరిస్థితిని అద్దం పడుతుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది.. దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా విషపూరితమైన చెట్లు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. జనావాసాల్లో కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అలాంటి ఓ చెట్టు అమెరికాలోని ఫ్లోరిడా, కరేబియన్ దీవుల్లో కనిపిస్తుంది. ఆ చెట్టు పేరు మంచినిల్. దానికి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా పేరుంది. ఆ చెట్టును తాకితే చాలు.. శరీరంపై బొబ్బలు వస్తాయి. ఆపిల్ ఆకారంలో ఉండే ఆ చెట్టు పండ్లు తింటే.. మనిషి నిద్రలోనే మరణిస్తాడని అంటుంటారు.

క్రిస్టోఫర్ కొలంబస్ అనే శాస్త్రవేత్త మంచినిల్ పండుకు ”ఆపిల్ అఫ్ ది డెత్” అని పేరు పెట్టారు. ఈ చెట్టు ఎంతటి విషపూరితమంటే.. పండు రసం కళ్లకు తగిలితే చాలు.. ఆ వ్యక్తి అంధుడు అయినట్లే. వర్షంలో కూడా ఈ చెట్టు కింద నిలబడటం మానవులకు హాని కలుగుతుంది. నికోలా హెచ్‌స్ట్రిక్‌ల్యాండ్ అనే శాస్త్రవేత్త చెప్పిన మాటల ప్రకారం, ఒకసారి అతను, అతని స్నేహితులు కొందరు కరేబియన్ ద్వీపంలోని టొబాగో బీచ్‌లో ఈ పండును తిన్నారట. ఇక తిన్న కొద్దిసేపటికే వారి శరీరం మండిపోతున్నట్లుగా అనిపించిందట. అలాగే వాపు కూడా రావడంతో అప్రమత్తమై చికిత్స తీసుకున్నామని.. పరిస్థితి మెరుగైందని అన్నారు.

కాగా, ప్రజలు ఆ చెట్టును తాకకుండా, దాని పండ్లను తినకుండా ఉండేలా అధికారులు మంచినిల్ చెట్టు చుట్టూ బోర్డులు, కంచె వేశారు. మంచినిల్ చెట్టు ఎత్తు సుమారు 50 అడుగులు ఉంటుంది. మరోవైపు కరేబియన్ వడ్రంగులు శతాబ్ద కాలం నుంచి ఈ చెట్టును ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దానిని ఉపయోగించే ముందు.. విషాన్ని తొలగించేందుకు ఆ చెట్టు కలపను చాలా రోజులు ఎండలో ఎండబెట్టేవారట.

Also Read:

దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..