Pig Attack: వామ్మో పంది.. బయటకు వస్తే ఎటాకే.. భయంతో వణుకుతున్న హౌసింగ్ సొసైటీ వాసులు
Pig Fear: సాధారణంగా మనం చాలా రకాల జంతువులను నిత్యం చూస్తుంటాం. వాటిలో కొన్ని మనుషులకు దగ్గరగా విశ్వాసంతో మెసులుకుంటుంటాయి. అయితే.. వాటికి కోపం వస్తే మాత్రం ముందు
Pig Fear: సాధారణంగా మనం చాలా రకాల జంతువులను నిత్యం చూస్తుంటాం. వాటిలో కొన్ని మనుషులకు దగ్గరగా విశ్వాసంతో మెసులుకుంటుంటాయి. అయితే.. వాటికి కోపం వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా దాడి చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు సైతం పొగొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఓ పంది మాత్రం ఓ హౌసింగ్ సొసైటీ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. హౌసింగ్ సొసైటీ ప్రజలు బయటకు వస్తే చాలు.. అటాక్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దాదాపు నెల నాటినుంచి సరిగ్గా నిద్రలేకుండా భయంతో బతుకుతున్నట్లు హౌసింగ్ సొసైటీ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పేర్కొంటున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటుచేసుకుంది.
పూణే మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిబ్వేవాడి ప్రాంగణంలో.. సిబ్బంది పందులను పట్టుకుంటుండగా.. ఓ పంది తప్పించుకుంది. ఆ పంది పిల్లలను పట్టుకొని వెళ్లిన అనంతరం.. అది అనికేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోకి ప్రవేశించింది. అప్పటినుంచి సొసైటీ ప్రజలపై దాడి చేయడం ప్రారంభించిందని నివాసితులు పేర్కొంటున్నారు. దాదాపు మూడు వారాల నుంచి బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని సొసైటీ నివాసితులు వెల్లడిస్తున్నారు. అయితే అదృష్టం ఏంటంటే.. ఇంతవరకూ ఎవరూ కూడా గాయపడలేదని పేర్కొంటున్నారు. పంది చిన్నారులను సైతం వెంబడిస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాగా.. ఈ సంఘటనపై పూణే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. త్వరలోనే పందిని పట్టుకుంటామని మంగళవారం తెలిపారు. ఈ వ్యవహారంపై తమ దృష్టికి ఇప్పుడే అందిందని.. పందిని పట్టుకునేందుకు సిబ్బందిని పంపిస్తామన్నారు. అప్పటివరకూ సొసైటీ వాసులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: