జ్యోతి మల్హోత్రా అక్కడ కూడా పర్యటించిందా.. వామ్మో.. వెలుగులోకి సంచలన విషయాలు
శతృదేశానికి కీలకమైన సమాచారాన్ని చేరవేస్తూ సొంత దేశాన్నే ప్రమాదంలోకి నెట్టేల వ్యవహరించిన జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందే ఆమె అక్కడ పర్యటించి వీడియో షూట్ చేసింది. అంతకుముందే ఆమె మరో రాష్ట్రంలో పర్యటించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

జ్యోతి మల్హోత్రా.. సొంత దేశానికి సంబంధించిన కీలక సమచారాన్ని శతృదేశమైన పాక్‌కు చేరవేసిన ద్రోహి. హర్యానాకు చెందిన ఈ వ్లాగర్ ప్రస్తుతం జైల్లో ఉంది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న ఆమెకు పాక్ అధికారులతో లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండేళ్లో మూడుసార్లు పాక్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. ఆమె పాక్లో పర్యటించినప్పుడు అక్కడి అధికారులు ఆమెకు సెక్యూరిటీ కల్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాకుండా తనను పెళ్లిచేసుకుని పాక్‌కు తీసుకెళ్ళాలని ఓ అధికారిని కోరినట్లు సమాచారం . ఇక పహల్గామ్ ఉగ్రదాడి జరిగే కొన్ని రోజుల ముందు ఆమె అక్కడ పర్యటించింది. దీంతో అక్కడి సమాచారాన్ని పాక్‌కు ఆమెనే చేరవేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో ఆమె కేరళలోనూ పర్యటించినట్లు తెలుస్తోంది. పర్యాటక శాఖ ఆహ్వానం మేరకు ఆమె కేరళను సందర్శించారు. తాజాగా ఇది వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
కేరళలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక శాఖ ఆహ్వానించిన ఇన్‌ఫ్లూయేన్సర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. జనవరి 2024, మే 2025 మధ్య పర్యాటక శాఖకు ప్రచారం చేసిన 41 మంది ఇన్‌ఫ్లూయేన్సర్లలో ఈ వివాదాస్పద వ్లాగర్ కూడా ఉన్నారు. పర్యాటక శాఖ ఖర్చుతో జ్యోతి.. కన్నూర్, కోజికోడ్, కొచ్చి, అలప్పీ, మున్నార్ వంటి ప్రదేశాలను సందర్శించారు. అంతేకాకుండా కేరళలోని వివిధ వ్యూహాత్మక ప్రదేశాలను సందర్శించి, ఆ ఫుటేజీని చిత్రీకరించింది. ఆయా ప్రదేశాల్లో జ్యోతి ఏమైన స్పై చేసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో బీజేపీ నేతలు సీపీఎం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ గూఢచారికి కేరళ ప్రభుత్వం స్పాన్సర్ గా వ్యవహరించిందని ఆరోపించారు. సీపీఎం నేతలు మాత్రం బీజేపీ వ్యాఖ్యలను తప్పికొట్టారు. పాక్‌కు సమాచారం చేరవేసే దాక కేంద్రం ఏం చేస్తుందని ఎదరుదాడికి దిగారు. కాగా దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న మొత్తం 12మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని ఏ ఏ సమాచారం అందించారు, పాక్‌లో ఎవరినీ సంప్రదించారు అనే విషయాలను రాబడుతున్నారు. అంతేకాకుండా వారిని నిధులు ఎట్లా అందాయనే కోణంలోనూ విచారణ సాగుతున్నారు. డబ్బు కోసం మాతృభూమికి సంబంధించిన సమాచారాన్ని శతృదేశానికి చేరవేసిన వారిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..