కర్నాటక సీఎం ఎడ్యూరప్ప నాయకత్వ మార్పుపై ఊహాగానాలు..మఠాధిపతులతో మంతనాలు..వరుస ట్వీట్లు
కర్నాటక లో సీఎం ఎడ్యూరప్ప నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన పలువురు మఠాధిపతులతోను, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి తో కూడా సమావేశాలు జరుపుతున్నారు.
కర్నాటక లో సీఎం ఎడ్యూరప్ప నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన పలువురు మఠాధిపతులతోను, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి తో కూడా సమావేశాలు జరుపుతున్నారు. పైగా బుధవారం సాయంత్రం నుంచి ఆయన బీజేపీని ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఢిల్లీలో గతవారం ప్రధాని మోదీతోను, ఇతర పార్టీ నేతలతోను భేటీ అయి బెంగుళూరు తిరిగి వచ్చినప్పటినుంచి ఇక రాష్ట్రంలో ఆయన లీడర్ షిప్ ని మారుస్తారని రూమర్లు జోరందుకున్నాయి. తన పదవికి ఢోకా లేదని, నాయకత్వ మార్పుపై ఏవరూ తనతో చర్చించలేదని ఢిల్లీలో మీడియాకు ఆయన స్పష్టం చేసినప్పటికీ ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎడ్యూరప్ప తాను పార్టీకి విధేయుడినైన సేవకుడినని, ఇందుకు గర్విస్తున్నానని, పార్టీకి సేవ చేయవలసి రావడం తనకు గౌరవప్రదమని ట్వీట్ చేశారు. ఇంతేకాదు.. బీజేపీని ఇరకాటంలో పెట్టే..లేదా అగౌరవ పరిచే ఏ విధమైన కార్యకలాపాలకూ తను పాల్పడలేదని, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, క్రమశిక్షణను కూడా ఉల్లంఘించలేదని ట్వీటించారు. రాష్ట్రంలో ఎడ్యూరప్ప అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్నాయి. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈ నెల 23 న జరుగుతుందని అంటున్నారు.
టూరిజం శాఖ మంత్రి సి’పి. యోగేశ్వర్, ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్, ఎమ్మెల్సీ విశ్వనాధ్ వంటివారితో సహా పలువురు యడ్యూరప్పపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తన కుమారుడికే ఆయన పాలనా బాధ్యతలు అప్పజెబుతున్నారని, ఈయన హయాంలో అవినీతి పెరిగిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం హెచ్చరించినా వీరు పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎడ్యూరప్ప మఠాధిపతులతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.
ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.