IT Raids: దైనిక్ భాస్కర్ మీడియా సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు.. పలు కీలక పత్రాల స్వాధీనం..!
ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Income Tax Raids on Dainik Bhaskar media groups: ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దైనిక్ గ్రూపు ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న ఆఫీసుల్లో ఆ సోదాలు సాగుతున్నాయి. దేశంలో ఉన్న దిన పత్రికల్లో దైనిక్ భాస్కర్ గ్రూపు చాలా పెద్దది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో.. చాలా దూకుడుగా ఈ పత్రిక రిపోర్టింగ్ చేసింది. మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను తప్పుపడుతూ లోతైన కథనాలను రాసింది. అధికారుల సోదాల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.