India Corona Cases: దేశంలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.. ఆందోళన కలిగిస్తోన్న వేరియంట్లు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 పాజిటివ్ కేసులు..

India Corona Cases: దేశంలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.. ఆందోళన కలిగిస్తోన్న వేరియంట్లు..
India Corona Updates
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2021 | 9:52 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కి చేరింది. ఇందులో 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 38,652 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,29,339కి చేరింది.

అటు నిన్న 507 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,18,987 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 41,78,51,151 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు థర్డ్ వేవ్ టెన్షన్, కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోతే కరోనా థర్డ్ వేవ్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

థర్డ్ వేవ్ టెన్షన్.. వేరియంట్ల గుబులు..

అటు కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. కేరళలో ఇప్పటివరకు కరోనా నియంత్రణలోకి రాలేదు. దేశంలో అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. దీంతో టెస్టింగ్‌ పెంచాలని నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. రోజుకు 3 లక్షల టెస్ట్‌లు చేయబోతున్నారు.

కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాట్లను చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత నెల 12, 13 తేదీల్లో కూడా కేరళలో కఠిన ఆంక్షలు విధించారు. బక్రీద్‌ సందర్భంగా ఆంక్షలను ఎత్తివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది.

థర్డ్‌ వేవ్‌పై ఏపీలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలు చేయాలని చూస్తున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఆసుపత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో నాన్‌ ఐసీయు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లానింగ్‌ పేరుతో 696 కోట్లు రూపాయలు కేటాయించాయి. ఈ నిధులతో అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రుల్లో 12 పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కొవిడ్‌ రూల్స్‌ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!