AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంత పద్మనాభ ఆలయంలో అద్భుత ఘటన.. చనిపోయిన మొసలి స్థానంలో

కేరళ కాసర్‌గోడ్‌లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని సరస్సులో నివసించి, దాని ఆవరణలో సంచరించే దశాబ్దాల నాటి ఒంటరి మొసలి చనిపోయి ఒక సంవత్సరం పైగా గడిచిన తరువాత, ఇటీవల ఆలయంలో కొత్త మొసలి కనిపించింది. ఒక మొసలి చనిపోయినప్పుడు మరొకటి అనివార్యంగా సరస్సులో కనిపిస్తుందని భక్తులు చెబుతున్నారు.

అనంత పద్మనాభ ఆలయంలో అద్భుత ఘటన.. చనిపోయిన మొసలి స్థానంలో
Crocodile Babiya guarded Sree Ananthapadmanabha Swamy Temple at Kumbla (Twitter: @AdvkShreekanth)
Ram Naramaneni
|

Updated on: Nov 13, 2023 | 5:37 PM

Share

విశిష్ఠత, సంపద, వైభోగం, చారిత్రక కారణాల వల్ల కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఆ టెంపుల్‌లో ఉన్న నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. కాగా ఈ గుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో ‘బబియా’ అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ప్రసాదం తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు.  ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టేది కాదట. టెంపుల్‌కి వెళ్లినవారు ఈ ముసలిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ మొసలి గత ఏడాది అక్టోబర్ 9న మరణించింది.  కాగా ఇప్పుడు అదే సరుస్సులోకి మరో మొసలి వచ్చి చేరిందన్న న్యూస్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారులకు.. ఆలయ ప్రధాన పూజారికి  తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలి అని, ఆలయ పూజారి చెప్పిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. అయితే ఈ సరస్సులో కొత్తగా మొసలి కనిపించడం ఇదే తొలిసారి కాదని ఆలయ పండితులు చెబుతన్నారు.  బబియా వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని వెల్లడించారు. దాని కంటే ముందు కూడా 2 మొసళ్లు ఆ సరస్సులో జీవించినట్లు వివరిస్తున్నారు. ఒకప్పుడు ఆ సరస్సులో ఒక పెద్ద మొసలి ఉండేదని.. దాన్ని బ్రిటీష్ వారు కాల్చి చంపేశారని కూడా కొందరు చెబుతున్నారు.

కాగా గతేడాది బబియా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు అదే స్థానంలో మరో మొసలి కనిపించడంతో అందరూ వింతగా చర్చించుకుంటున్నారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us