Yamuna River: మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న యమునా నది.. ప్రమాదకర స్థాయి దాటడంతో ఆందోళనలో స్థానికులు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాల చోట్ల లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవుతున్నాయి. ఇక ఢిల్లీలో యమనా నది తన ఉగ్రరూపాన్ని మళ్లీ తీవ్రతరం చేస్తోంది. గత కొన్నిరోజుల పాటు ఈ యుమనా నది ప్రవాహం తగ్గింది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాల చోట్ల లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవుతున్నాయి. ఇక ఢిల్లీలో యమనా నది తన ఉగ్రరూపాన్ని మళ్లీ తీవ్రతరం చేస్తోంది. గత కొన్నిరోజుల పాటు ఈ యుమనా నది ప్రవాహం తగ్గింది. కానీ ఢిల్లీలో మళ్లీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని. బుధవారం ఉదయం నాటికి యమునా నది నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటేసింది. దీంతో ఢిల్లీ వాసులు ఆందోళ చెందుతున్నారు. భారీ వర్షాలు కురవడం వల్లే మళ్లీ యమునా నది ఉప్పొంగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే యమునా నది నీటిమట్టంపై కేంద్ర జల కమిషన్ కీలక సమాచారాన్ని విడుదల చేసింది. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 205.33 మీటర్లు దాటిపోయిందని చెప్పింది. ఈ ప్రమాదకర స్థాయిని దాటి ప్రస్తుతం 205.48 మీటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఇంకో విషయం ఏంటంటే బుధవారం సాయంత్రం నాటికి 205.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం యమునా నది నీటి మట్టం స్థాయి ఆల్ టైం రికార్డుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రమాదకర స్థాయిని దాటి ఏకంగా 208.66 మీటర్లు నమోదైంది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు మళ్లీ యుమునా నది ప్రమాదకర పరిస్థితిని దాటడంతో మళ్లీ వరదలు సంభవిస్తాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.