AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు

Metro Station: అప్పుడప్పుడు అడువుల్లో ఉండే వణ్య ప్రాణులు జనవాల మధ్యకు వస్తుంటాయి. ఒక వైపు వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటే.. మరో వైపు అడవుల్లో ఉండే అరుదైన ఆఫ్రికా అతిపెద్ద బల్లీ మెట్రో స్టేషన్‌లోకి రావడం కలకలం రేపింది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే మెట్రో సిబ్బందికి సమాచారం అందించగా..

Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు
Subhash Goud
|

Updated on: Sep 07, 2025 | 5:21 PM

Share

Metro Station: ఢిల్లీలోని యమునా నది వరద మానవులకే కాకుండా జంతువులకు కూడా ఇబ్బందిగా మారింది. వరదల తరువాత యమునా చుట్టూ నివసించే ప్రజలు తమ ఇళ్లను వదిలి సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అదే సమయంలో అడవి జంతువులు కూడా తమ బొరియలను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ సమయంలో ఒక పెద్ద బల్లి పొడి ప్రదేశాన్ని వెతుకుతూ మయూర్ విహార్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయపడిపోయారు. మెట్రో స్టేషన్ సిబ్బంది వెంటనే వన్యప్రాణుల బృందానికి సమాచారం అందించారు. ఆ తర్వాత బల్లిని రక్షించారు.

ఇది కూడా చదవండి: GST Reduction: జీఎస్టీ తగ్గింపు తర్వాత ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీల ధరలు ఎంత తగ్గుతాయో తెలుసా?

మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్‌లోకి వచ్చిన అరుదైన ఆఫ్రికా బల్లి ఇది అని వన్యప్రాణి బృందం తెలిపింది. మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్ పాంట్రీ ప్రాంతంలో బల్లి ఉన్నట్లు సమాచారం అందిందని వైల్డ్ లైఫ్ SOS సహ వ్యవస్థాపకుడు, CEO కార్తీక్ సత్యనారాయణ తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దానిని రక్షించింది. బల్లిని సురక్షితంగా బయటకు తీశారు. దాని సహజ ఆవాసాలలోకి తిరిగి వదలనున్నారు.

ఇది కూడా చదవండి: Google: గూగుల్‌లో ఈ నంబర్లను వెతుకుతున్నారా? మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. జాగ్రత్త!

ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 205.56 మీటర్లుగా నమోదైంది. దేశ రాజధానికి హెచ్చరిక గుర్తు 204.50 మీటర్లు. ప్రమాద గుర్తు 205.33 మీటర్లు. అలాగే జనాలను తరలింపు పనులు 206 మీటర్ల వద్ద ప్రారంభమవుతాయి. పాత రైల్వే వంతెన నది ప్రవాహాన్ని, వరద ముప్పులను గమనించడానికి ప్రధాన పర్యవేక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. గత కొన్ని రోజులుగా నది వెంబడి ఉన్న అనేక ప్రాంతాలు మునిగిపోయాయి.

ఇది కూడా చదవండి: e Aadhaar App: ఒకే యాప్‌లో అన్ని ఆధార్ సేవలు.. అద్భుతమైన ఫీచర్లతో త్వరలో ఈ-ఆధార్‌ యాప్‌!

నదికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల నుండి తరలించిన ప్రజల తాత్కాలిక వసతి కోసం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, మయూర్ విహార్ ప్రాంతాలలో టెంట్లు ఏర్పాటు చేశారు. వరద నియంత్రణ విభాగం ప్రకారం, హతినికుండ్ బ్యారేజీ నుండి 51,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వజీరాబాద్ బ్యారేజీ నుండి దాదాపు 73,280 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీల నుండి విడుదలయ్యే నీరు సాధారణంగా ఢిల్లీకి చేరుకోవడానికి 48 నుండి 50 గంటలు పడుతుంది. ఎగువ ప్రాంతాల నుండి తక్కువ నీటిని విడుదల చేయడం వల్ల నీటి మట్టం కూడా పెరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి