జైల్లో తనకు స్పెషల్ ఫుడ్ కావాలన్న రెజ్లర్ సుశీల్ కుమార్….ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే ….?
యువ రానా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ' ఒలంపిక్ మెడలిస్ట్'.. సుశీల్ కుమార్ తనకు స్పెషల్ డైట్ కావాలని ఢిల్లీ కోర్టును కోరాడు. నాకు ఒమేగా 3 క్యాప్స్యూల్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు, వర్కౌట్ కోసం ఎక్సర్ సైజ్ బ్యాండ్స్ అవసరమని అన్నాడు....
యువ రానా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ‘ ఒలంపిక్ మెడలిస్ట్’.. సుశీల్ కుమార్ తనకు స్పెషల్ డైట్ కావాలని ఢిల్లీ కోర్టును కోరాడు. నాకు ఒమేగా 3 క్యాప్స్యూల్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు, వర్కౌట్ కోసం ఎక్సర్ సైజ్ బ్యాండ్స్ అవసరమని అన్నాడు. తాను పోటీలకు వెళ్తున్నానని, అందువల్ల ఇవన్నీ కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. (మరి ఏ పోటీలకు వెళ్తున్నాడో తెలియదు).. కానీ ఇవన్నీ ఇతని ‘కోర్కెలు’గా కనిపిస్తున్నాయని, అవసరం లేదని పేర్కొంటూ కోర్టు ఈ పిటిషన్ ని కొట్టివేసింది. అసలు ఈ పిటిషన్ ని పరిశీలిస్తుంటే నిందితుడు (అప్లికెంట్) పైగా తోటి రెజ్లర్ ను మర్డర్ చేసిన వ్యక్తి.. ఎలాంటి వ్యాధితోనూ బాధ పడడంలేదని తెలుస్తోందని, ఇతనికి ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం మామూలుగా హెల్దీ డైట్ ఇవ్వాలని ఆదేశించింది. చట్టమన్నది అందరికీ సమానమేనని అందరినీ ఒకేవిధంగా చూడాలని పేర్కొంది. తన అరెస్టుకు ముందు సుశీల్ కుమార్ మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు. పోలీసుల ఇంటరాగేషన్ లో పొంతన లేని సమాధానాలు చెప్పాడని లోగడ వార్తలు వచ్చాయి. ఇతని సహచరుడైన అజయ్ కుమార్ ని కూడా పోలీసులు మొదట అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను వారు అరెస్టు చేయగా ఒకరు ప్రభుత్వ అప్రూవర్ గా మారారు.
సుశీల్ కుమార్ ని ఢిల్లీ లోని మండోలీ జైల్లో ప్రత్యేక సెల్ లో ఉంచారు. ఎవరినీ కలుసుకోవడానికి అనుమతించడం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.