ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు హర్యానాలో జాతీయ పతాకాలను ఎగురవేయనీయం.. రైతు సంఘాల హెచ్చరిక

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు హర్యానాలో జాతీయ పతాకాలను ఎగురవేయనీకుండా అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించాయి.

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు హర్యానాలో జాతీయ పతాకాలను ఎగురవేయనీయం.. రైతు సంఘాల హెచ్చరిక
Haryana Farmers

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు హర్యానాలో జాతీయ పతాకాలను ఎగురవేయనీకుండా అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఆ రోజున బీజేపీ నేతలనెవరినీ జాతీయ జెండాలను ఎగురవేయనివ్వబోమని, ఏ నేత అయినా ఇందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని పేర్కొన్నాయి. వారికి నల్ల జెండాలను చూపుతామని, ఎక్కడికక్కడ వారి కార్యక్రమాలను అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు తెలిపారు. జాతీయ జెండాలను ఆవిష్కరించేందుకు వారు అర్హులు కారని ఓ యూనియన్ నేత వ్యాఖ్యానించాడు. తమ ఆందోళనకు పంజాబ్ రైతులు కూడా కలిసివస్తారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పాడు. మరో వైపు ఆగస్టు 15 న ఢిల్లీలోకూడా ఈ విధమైన ప్రొటెస్ట్ చేయాలా అని తమ భవిష్యత్ కార్యాచరణను 42 రైతు యూనియన్లు నిర్దేశించుకుంటున్నాయి. ఈ సందర్భంగా గత జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీలో తమ ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసులు పలువురు రైతులపై పెట్టిన కేసులను కూడా వీరు గుర్తు చేసుకుంటున్నారు.

ఆ రోజున ఎర్రకోట వద్ద మతపరమైన జెండాను ఎగురవేసిన సందర్భంలో పోలీసులతో జరిగిన ఘర్షణలను వీరు ప్రస్తావించారు. అయితే ఆ కేసుల విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని.. వాటిని ఖాకీలు ఉపసంహరించుకునేలా చూసేందుకు లాయర్ల కమిటీని ఏర్పాటు చేయడం.. దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించడాన్ని కూడా కొందరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. లెఫ్టినెంట్ గవర్నర్ తమ ప్రతిపాదనను తిరస్కరించడాన్ని ఢిల్ఝి ప్రజలకు జరిగిన అవమానంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం నుంచి పార్లమెంటు వద్ద తమ ధర్నాను ఉధృతం చేయాలనీ, మరింతమంది రైతులు ఇందులో పాల్గొనేట్టు చూడాలని కూడా రైతు సంఘాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి

Skin Care Tips : మెరిసే చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్..! ఎలాగో తెలుసుకోండి..

Click on your DTH Provider to Add TV9 Telugu