AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మృతి..

జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరా లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. మృతుల్లో ఒకడైన షకీర్ అనే టెర్రరిస్టు 2018 లో పాకిస్తాన్ లోని వాఘా బోర్డర్ నుంచి అమృత్ సర్ లో ప్రవేశించాడని..

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మృతి..
3 Terrorists Killed
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 25, 2021 | 4:51 PM

Share

జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరా లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. మృతుల్లో ఒకడైన షకీర్ అనే టెర్రరిస్టు 2018 లో పాకిస్తాన్ లోని వాఘా బోర్డర్ నుంచి అమృత్ సర్ లో ప్రవేశించాడని, అప్పటి నుంచి రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తూ వచ్చేవాడని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్ కౌంటర్ లో మరణించిన ముగ్గురూ నిషిద్ధ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని ఆయన చెప్పారు. బందిపోరా లోని షొక్ బాబా అడవుల్లో కొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతాదళాలు గాలింపు జరపగా చెట్ల చాటున నక్కి ఉన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డాడని వెల్లడించారు. అయితే భద్రతా దళాల ఫైరింగ్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారని, మరో ఇద్దరు ముగ్గురు అక్కడే ఉన్నట్టు తెలిసిందని ఆయన అన్నారు. వారికోసం గాలిస్తున్నట్టు విజయ్ కుమార్ తెలిపారు.

గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. అటు కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. ఘటనా స్థలం నుంచి తీవ్రవాద సాహిత్యాన్ని, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు మాత్రం రహస్యంగా జమ్మూ కాశ్మీర్ లోకి టెర్రరిస్టులను పంపుతూనే ఉన్నాయని, అయితే ఎప్పటికప్పుడు తాము పరిస్థితిని మదింపు చేస్తున్నామని, ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తున్నామని భద్రతాదళ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట లొంగి పోవలసిందిగా హెచ్చరించినా వారు లక్ష్య పెట్టకపోవడం వల్లే కాల్పులు జరపాల్సి వస్తోందని ఈ వర్గాలు వివరించాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: రైలు ఎక్కబోతూ కాలు జారి పడిపోబోయిన ప్రయాణికుడిని ఆ పోలీసు ఎలా రక్షించాడంటే ..?

అస్సాంలో రెండు రోజుల్లో 24 మంది రోహింగ్యాలు అరెస్ట్.. అక్రమ ఎంట్రీకి కట్టడి !