అస్సాంలో రెండు రోజుల్లో 24 మంది రోహింగ్యాలు అరెస్ట్.. అక్రమ ఎంట్రీకి కట్టడి !

అస్సాంలో గత 2 రోజుల్లో 24 మంది రోహింగ్యా శరాణార్థులను అరెస్టు చేశారు. వీరిలో పలువురు పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

అస్సాంలో రెండు రోజుల్లో 24 మంది రోహింగ్యాలు అరెస్ట్.. అక్రమ ఎంట్రీకి కట్టడి !
24 Rohingyas Arrest
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 25, 2021 | 4:43 PM

అస్సాంలో గత 2 రోజుల్లో 24 మంది రోహింగ్యా శరాణార్థులను అరెస్టు చేశారు. వీరిలో పలువురు పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరు యునైటెడ్నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ పేరిట ఫేక్ ఐడీ కార్డులు చూపారని తెలిసింది. ఈ నెల 23 న కూడా కొంతమంది రోహింగ్యా శరణార్థులను అరెస్టు చేశారు. ఈ ఉదయం గౌహతి రైల్వే స్టేషన్ లో కొంతమందిని అదుపులోకి తీసుకోగా గత శుక్రవారం కరీంగంజ్ జిల్లా బాదర్ పూర్ లో సిల్చార్-అగర్తలా రైలు ఎక్కబోతున్న మరికొందరిని అదుపులోకి టీఎసుకున్నారు. వీరిలో కొంతమంది వద్ద మాత్రమే సరైన చెల్లుబాటు పత్రాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. మిగిలినవారి వద్ద ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు. వీరిది ఇల్లీగల్ ఎంట్రీ అని, భారత చట్టాల కింద వీరిని విచారిస్తామని వెల్లడించారు,

ఇలాంటి అక్రమ వ్యక్తులను జాతీయ భద్రతకు ముప్పు కలిగించేవారిగా పరిగణిస్తామని ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. తమ చెల్లుబాటు పత్రాల కాల పరిమితి ముగిసినప్పటికీ.. ఇంకా దేశంలో చట్ట విరుద్ధంగా ఉన్నవారిని ఇలా పరిగణిస్తామని, ఆయా చట్టాలకింద వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. కాగా-హవాలా మార్గాల ద్వారా రోహింగ్యాలు నిధులను సమీకరిస్తున్నారని, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్తలు వీరిని వినియోగించుకుంటున్నాయని కేంద్రం లోగడ వెల్లడించింది.మనుషుల అక్రమ రవాణా వంటి అక్రమ చర్యలకు రోహింగ్యాలు పాల్పడుతున్నారట.. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఈ నెల 7 న ఇద్దరు రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. 2018 నుంచి వీరు ఇక్కడ అక్రమంగా ఉండడమే గాక.. మయన్మార్ కు చెందిన ఇద్దరు మహిళలను కూడా పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Cow : కాకరేపుతోన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవులపై చేసిన కామెంట్

Ashadam Mehendi: పెద్దలమాట చద్దిమూట.. ఆషాడంలో గోరింటాకును మహిళలు పెట్టుకోవడంలో శాస్త్రీయ కోణం..