Cow : కాకరేపుతోన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవులపై చేసిన కామెంట్
గోమధ్యేస్థితం విశ్వం. విశ్వమధ్యే స్థితోగోవు. గోవిశ్వం సచానోస్మి. తస్మై శ్రీగోమాత్రేనమః అంటూ ఇక్కడ గోవును కొలుస్తుంటారు. గోవు కేంద్రంగా భారతదేశపు ఆధ్యాత్మిక చిత్రం మొత్తం అల్లుకుని కనిపిస్తుంది...
MLA Chennakesava Reddy – Cows : గోమధ్యేస్థితం విశ్వం. విశ్వమధ్యే స్థితోగోవు. గోవిశ్వం సచానోస్మి. తస్మై శ్రీగోమాత్రేనమః అంటూ ఇక్కడ గోవును కొలుస్తుంటారు. గోవు కేంద్రంగా భారతదేశపు ఆధ్యాత్మిక చిత్రం మొత్తం అల్లుకుని కనిపిస్తుంది. ఇక్కడ గోవంటే ముక్కోటి దేవతలను ఒక్క చోటే దర్శించుకునే వీలైన రూపం. గోవు నుంచి వెలువడే పంచగవ్యాలను పంచామృతాలుగా భావించే పుణ్యభూమి. ఇంటింటా సిరులు కురిపించే శ్రీమహాలక్ష్మిగా భావించే నేల భారతావని.
అలాంటి గోవుపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తెలిసో తెలీకో ఒక మాట అనేశారు. గో చట్టాలు చాలా చాలా పాతవనీ.. వాటినిక్కడ మెయిన్ టైన్ చేయాలంటే.. అందుకు తగిన ఏర్పాట్లు మన దగ్గర లేవనీ.. మన ప్రభుత్వ సిబ్బందికి సాధ్యం కాదని తేల్చేశారు. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖయ్యిమన్నారు. ఏమనుకుంటున్నారు మీరు..? ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కించపరచాలనుకున్నారా? లేక మన రాజ్యాంగాన్నే అవమానించదలుచుకున్నారా? అంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డారు.
ఇంతకీ చెన్నకేశవరెడ్డి అన్న మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎలా మాట్లాడి ఉండాల్సింది? పాతవని చట్టాలను కాలరాయాలా? లేక చట్టం పాతదైనా కొత్తదైనా సరే తగిన విధంగా అమలు చేయాలా? ఎమ్మెల్యేగా ఆయన ఎలాంటి ప్రమాణం చేసి ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యే ఇలా మాటలాడ్డం తగునా అన్నది బీజేపీ వినిపిస్తున్న ఇన్నర్ వాయిస్. అలాంటిదేం లేదు. ఇక్కడున్న సాధ్యాసాధ్యాలను మాత్రమే తాను చెప్పాననీ.. దాన్ని సవరించుకోవల్సి ఉంటే సవరించుకోవాలి. అంతే కానీ నా మీద ఇలా మండి పడ్డం తగదన్నది ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆఫ్ లైన్ వివరణ.
ఏది ఏమైనా.. గోవు మన సున్నితాంశం. ఆచీ తూచీ వ్యవహరించాల్సిన విషయం. గోసంరక్షణపై ఇందిరాగాంధీ కాలం నాటి నుంచి ఉద్యమాలు సాగుతున్నాయ్. ఇప్పుడా ఉద్యమం మరింత ఊపందుకుని కనిపిస్తోంది. మనం లేకుంటే గోవు ఉంటుందేమోగానీ, గోవులేక మనం బతకలేం. కాబట్టి మన జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలన్న నినాదం వెలుగు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాస్త సంయమనం పాటించి ఉండాల్సింది..
ఎంత కష్టసాధ్యమైనా.. గోవును రక్షించుకోవడం మనందరి బాధ్యత గా మాట్లాడుండాల్సింది. అంతేకానీ.. గోవును కాపాడ్డం మన వల్ల కాదని చేతులెత్తేసేలా మాట్లాడ్డం తగదని వారిస్తున్నారు గోఉద్యమ కార్యకర్తలు. దానికి తోడు సంప్రదాయాలను కించపరచడం మన పద్ధతి కాదు. ఇతరుల మనోభావాలను దెబ్బ తీయడం మన సంస్కృతి కాదు. కావున.. ఇరు పక్షాలు ఒకరినొకరు అర్ధం చేసుకుని వ్యవహరించడమే కరెక్టన్నమాట వినిపిస్తోంది.
Read also : Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్