Sri Vishnu Sahasranamam: భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాలను వ్యాసుడు మహర్షి ఎలా లిఖించాడో తెలుసా

Sri Vishnu Sahasranamam:హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన దానిలో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం. సహస్ర అంటే వెయ్యి.. అంటే ఈ స్తోత్త్రం లో వేయినామాలుంటాయి. విష్ణువు ని..

Sri Vishnu Sahasranamam: భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాలను వ్యాసుడు మహర్షి ఎలా లిఖించాడో తెలుసా
Vishnu Sahasranamalu
Follow us

|

Updated on: Jul 25, 2021 | 2:34 PM

Sri Vishnu Sahasranamam:హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన దానిలో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం. సహస్ర అంటే వెయ్యి.. అంటే ఈ స్తోత్త్రం లో వేయినామాలుంటాయి. విష్ణువు ని వెయ్యి నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం. ఈ స్తోత్రం మొదటిగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149 వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్రయుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ స్తోత్ర పారాయణం చేసినవారి కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం.. ఈ స్తోత్ర ప్రస్తావన గరుడపురాణంతో పాటు, పద్మపురాణములో కూడా ఉంది. ఈ మూడింటిని వ్యాసుడే రచినట్లు తెలుస్తోంది. అయితే ఈ విష్ణు సహస్రనామాలు ఎలా లిఖించబడ్డాయో తెలుసా..

అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ధర్మరాజు తో సహా అందరూ శ్రద్ధగా విన్నారు కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అందింది తెలుసుకోవాలంటే.. 1940వ సంవత్సరం లో జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, “ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది” అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, “విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?”

ఒకరన్నారు, “భీష్ముడందించారన్నారు” స్వామివారు, “భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?” మళ్ళీ నిశబ్దం. అప్పుడు స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో విష్ణువుని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడు “ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా” అని అన్నాడు. అంతేకాదు “అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి” అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు శ్రీ కృష్ణుడు విష్ణు సహస్రనాలను లిఖించాలంటే అది ఒక్క సహదేవుడు, వ్యాసుడి వలెనే అవుతుంది అని చెప్పాడు.

“అదేలా” అని అందరూ అడిగారు. శ్రీ కృష్ణుడు చెప్పాడు.. మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని శ్రీ శ్రీ శ్రీ మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి సెలవిచ్చారు. యుగాలు మారినా, తరాలు మారినా నేటికీ విష్ణు సహానామ స్తోత్ర విశిష్ట వెలుగొందుతోంది.

Also Read: ఈ రోజు, రేపు ఆకాశంలో మరో అద్భుతం.. శని, గురు గ్రహానికి సమీపంలో చంద్రుడు

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.