Buck Moon: ఈ రోజు, రేపు ఆకాశంలో మరో అద్భుతం.. శని, గురు గ్రహానికి సమీపంలో చంద్రుడు

Buck Moon: ఈ రోజు, రేపు (జులై 24, 25)న మరో పెద్ద ఖగోళ అద్భుతం జరగనుంది. చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్తాడు. 25న గురుగ్రహానికి దగ్గరగా వెళ్లనున్నాడు..

Buck Moon: ఈ రోజు, రేపు ఆకాశంలో మరో అద్భుతం.. శని, గురు గ్రహానికి సమీపంలో చంద్రుడు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2021 | 1:18 PM

Buck Moon: ఈ రోజు, రేపు (జులై 24, 25)న మరో పెద్ద ఖగోళ అద్భుతం జరగనుంది. చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్తాడు. 25న గురుగ్రహానికి దగ్గరగా వెళ్లనున్నాడు. అంతేకాదు.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరైన రేఖలోకి వస్తాయని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు ఒక 5 డిగ్రీలు కాస్త పక్కకి ఉండడం వల్ల సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడి మీదే పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు చాలా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇలాంటి చంద్రుడిని బక్ మూన్ లేదా థండర్ మూన్ అని పిలుస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా, జూలై పౌర్ణమి రోజు వచ్చే కాంతివంతమైన చంద్రుడిని బక్ మూన్ అని పిలవవచ్చు. మగ జింకల కొమ్ములు ఈ సమయంలో బాగా పెరుగుతాయని చెబుతుంటారు. ఈ పేరును అల్గాన్ క్విన్ తెగ వారు పెట్టారు. మగ బక్ డీర్స్ తమ కొమ్ములను జూలై సమయంలోనే పెంచుతాయి. పాతవి విరిగిపోయి ఈ సమయంలో కొత్తవి వస్తుంటాయట. అంతేకాదు.. ఈ సమయంలో ఎక్కువ ఉరుములు, పిడుగులు కూడా పడుతుంటాయి కాబట్టి దీనిని థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ చందమామ రంగు కూడా తెల్లగా కాకుండా కాస్త ఎరుపు, నారింజ రంగుల కలయికలో ఉంటుంది.

జూలై 24న..

24న అంటే ఈరోజు చంద్రుడు నాలుగు డిగ్రీల పాటు పక్కకు జరుగుతాడు. దాంతో శని గ్రహానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు. ఈరోజు రాత్రి చంద్రుడు, శని గ్రహం రెండు కూడా పక్కపక్కనే మనకు ఆకాశంలో కనిపిస్తాయి. మరో నాలుగు డిగ్రీల పాటు జరిగి 25న గురుగ్రహానికి దగ్గరవుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా సోమవారం తెల్లవారకముందు సమయంలో పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. వీటిని నేరుగా లేదా బైనాక్యులర్స్ సాయంతో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Tirumal News: తిరుమల ఆలయ రక్షణ వ్యవస్థలో హై టెక్నాలజీ.. ఇక అలాంటివి ఎగరడం కష్టమే..

Library: ఆ లైబ్రరీలో పుస్తకం దొంగిలిస్తే తప్పించుకోలేరు.. హైటెక్ నిఘాతో ఇట్టే పట్టేస్తారు

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి