రైలు ఎక్కబోతూ కాలు జారి పడిపోబోయిన ప్రయాణికుడిని ఆ పోలీసు ఎలా రక్షించాడంటే ..?

ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో రైలు ఎక్కబోతూ కాలు జారి పట్టాలపై పడిపోబోయిన ఓ ప్రయాణికుడిని ఓ పోలీసు సాహసోపేతంగా రక్షించాడు.

రైలు ఎక్కబోతూ కాలు జారి పడిపోబోయిన ప్రయాణికుడిని ఆ పోలీసు ఎలా రక్షించాడంటే ..?
Slipped While Boarding Trai
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 25, 2021 | 4:47 PM

ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో రైలు ఎక్కబోతూ కాలు జారి పట్టాలపై పడిపోబోయిన ఓ ప్రయాణికుడిని ఓ పోలీసు సాహసోపేతంగా రక్షించాడు. రెండు చేతుల్లోనూ లగేజీతో వచ్చిన ఆ ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మీదకి రాగా అప్పుడే రైలు కదలడం ప్రారంభించింది. దీంతో ఆ వ్యక్తి హడావుడిగా ఒక చేతి లోని బ్యాగ్ ను ఓ బోగీలోకి విసిరి మరో చేత్తో హ్యాండిల్ పట్టుకుని ఎక్కబోతుండగా కాలు జారింది. అప్పటికి రైలు నెమ్మదిగా వేగం పుంజుకుంది. అతడ్ని ప్లాట్ ఫామ్ పైనే కొంత దూరం లాక్కుని వెళ్ళింది. దాంతో ఇక అతడు పట్టాలపై పడిపోబోతున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఇది చూసి పరుగున వెళ్లి అతడ్ని పక్కకు లాగబోయాడు. కానీ మొదటిసారి చేసిన యత్నం విఫలమై తాను కూడా కింద పడిపోయాడు. కానీ వెంటనే లేచి ఆ వ్యక్తిని పూర్తిగా పక్కకు లాగివేసి రక్షించాడు.ఈ కానిస్టేబుల్ ని రాజ్ వీర్ సింగ్ గా గుర్తించారు.

తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని రక్షించినందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అతడిని అభినందిస్తూ ట్వీట్ చేసింది. ‘హీరోస్ ఇన్ యూనిఫామ్’ అని పేర్కొంటూ ఈ వీడియోను రిలీజ్ చేసింది. తనను సేవ్ చేసిన రాజ్ వీర్ సింగ్ కి ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు. కదులుతున్న రైలు ఎక్కబోతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్లాట్ ఫామ్ లలో హెచ్చరిక బోర్డులు ఉంటున్నా చాలామంది పట్టించుకోవడం లేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాంలో రెండు రోజుల్లో 24 మంది రోహింగ్యాలు అరెస్ట్.. అక్రమ ఎంట్రీకి కట్టడి !

Tamannah: మెగాహీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌‌లో మెరవనున్న మిల్కీబ్యూటీ ..?