Skin Care Tips : మెరిసే చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్..! ఎలాగో తెలుసుకోండి..

Skin Care Tips : వర్షాకాలంలో చర్మ సమస్యలతో అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఈ సీజన్‌లో మొటిమలు సాధారణం. అనేక రకాల బ్యూటీ ప్రొడక్స్‌ మార్కెట్‌లోకి

Skin Care Tips : మెరిసే చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్..! ఎలాగో తెలుసుకోండి..
Neem Face Pack
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 25, 2021 | 5:00 PM

Skin Care Tips : వర్షాకాలంలో చర్మ సమస్యలతో అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఈ సీజన్‌లో మొటిమలు సాధారణం. అనేక రకాల బ్యూటీ ప్రొడక్స్‌ మార్కెట్‌లోకి వస్తాయి. అవి వాడిన తరువాత కూడా మంచి ఫలితాలు రాకపోతే ఇంటి చిట్కాలు ప్రారంభించవచ్చు. మొటిమల సమస్య నుంచి బయటపడటానికి మీరు వేపను ఉపయోగించవచ్చు. వేప ఒక ఔషధంగా మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. సహజమైన గ్లో విషయానికి వస్తే, వేప కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడానికి మీరు వేప ఆకులను ఉపయోగించవచ్చు. మీరు దీన్ని ఫేస్ ప్యాక్‌గా చేసుకొని వాడుకోవచ్చు. ఇది కాకుండా చర్మంలో పేరుకుపోయిన ధూళిని శుభ్రపరచడంలో ఇది సహాయపడుతుంది. వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తేనె, వేప ఫేస్ ప్యాక్

10 వేప ఆకులు 2 స్పూన్ల తేనె చిటికెడు దాల్చిన చెక్క పొడి

మీరు 10 నుంచి 12 వేప ఆకులను రుబ్బుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇందులో తేనె, దాల్చినచెక్క పౌడర్‌ కలపాలి. మీకు మొటిమల సమస్య ఉంటే ఈ మిశ్రమాన్ని ముఖం పై 10 నిమిషాలు అప్లై చేసి ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి. తరువాత ముఖంపై మాయిశ్చరైజర్ రాయాలి.

2. వేప, ముల్తానీ మట్టి పేస్ట్

15 వేప ఆకులు 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ 2 స్పూన్ ముల్తానీ మట్టి

మొదట మీరు వేప ఆకులను రుబ్బుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అందులో రోజ్ వాటర్ కలపాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి వేసి మందపాటి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగి ఆపై రోజ్‌వాటర్‌ ముఖంపై అప్లై చేయాలి.

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో

Skin Care : వైట్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ చిట్కాలను పాటించండి.. చక్కటి రూపం మీ సొంతం..

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మృతి..

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై