AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Captain Anshuman Singh Wife: అమర జవాన్‌ అన్షుమాన్ సింగ్‌ భార్య ఫొటోపై అసభ్య కామెంట్లు.. మహిళా కమిషన్ సీరియస్‌

అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ఆయన భార్య స్మృతి సింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మాదగా స్వీకరించారు. ఈ సందర్భంగా దివంగత జవాన్‌ అన్షుమాన్ ధైర్యాన్ని దేశం గుర్తు చేసుకుంది. జవాన్‌ భార్య స్మృతి సింగ్ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే కొందరు నీచులు సోషల్ మీడియాలో..

Captain Anshuman Singh Wife: అమర జవాన్‌ అన్షుమాన్ సింగ్‌ భార్య ఫొటోపై అసభ్య కామెంట్లు.. మహిళా కమిషన్ సీరియస్‌
Captain Anshuman Singh Wife
Srilakshmi C
|

Updated on: Jul 11, 2024 | 1:16 PM

Share

న్యూఢిల్లీ, జులై 11: అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ఆయన భార్య స్మృతి సింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మాదగా స్వీకరించారు. ఈ సందర్భంగా దివంగత జవాన్‌ అన్షుమాన్ ధైర్యాన్ని దేశం గుర్తు చేసుకుంది. జవాన్‌ భార్య స్మృతి సింగ్ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే కొందరు నీచులు సోషల్ మీడియాలో స్మృతి సింగ్ ఫోటోపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరవీరుడి భార్యపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌ అయ్యింది. అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేసింది.

2023లో కెప్టెన్ సింగ్‌ను (26) పంజాబ్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జూలై 19న సియాచిన్ గ్లేసియర్ సమీపంలోని ఆర్మీ క్యాంపులో అగ్నిప్రమాదం జరిగింది. ఇండియన్ ఆర్మీ మందుగుండు సామగ్రి డంప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న తన సహచరులను కాపాడేందుకు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ ప్రాణాలకు తెగించి మంటల్లోకి దూకారు. ప్రమాదంలో ఉన్న అందరినీ రక్షించగలిగారు. అయితే కెప్టెన్ అంగ్షుమాన్ తనను తాను రక్షించుకోలేకపోయారు. మంటల కారణంగా తీవ్ర గాయాలపాలై చనిపోయారు. జూలై 22న బీహార్‌లోని భాగల్‌పూర్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన త్యాగాన్ని, ధైర్య సాహసాలకు ప్రతీకగా కెప్టెన్ అంగ్‌షుమాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరణానంతరం కీర్తిచక్రతో సత్కరించింది. ఆయన తరపున ఆయన భార్య స్మృతి సింగ్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ గౌరవాన్ని స్వీకరించారు.

రాష్ట్రపతితో ఉన్న ఫోటోలో స్మృతి సింగ్‌ ఫొటోపై కొందరు అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కొత్త చట్టం ప్రకారం నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాసింది. ఢిల్లీకి చెందిన అహ్మద్ కె అనే వ్యక్తి కెప్టెన్ అంగ్షుమాన్ సింగ్ భార్యపై దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు గుర్తించారు.ఇండియన్ లా కోడ్ 2023లోని సెక్షన్ 79, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద అతడిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.

జాతీయ మహిళా కమిషన్‌ చర్యను నెటిజన్లు ప్రశంసించారు. వ్యక్తి వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసిన వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.