AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీలో ‘ఆమె’కు అందలం.. సుప్రీంకోర్టు ఆదేశం

భారత సైన్యంలో మహిళలకు కూడా సమున్నత పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైన్యంలో పురుష అధికారులతో సమానంగా కల్నల్ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి పోస్టులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే సైన్యంలో వారికి శాశ్వత కమిషన్ ఉండాలన్న  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సైన్యంలో  ఎక్కువగా గ్రామీణ మహిళలు చేరుతున్నారని, వీరి కారణంగా పురుష అధికారులు ఆత్మన్యూనతతో ఆందోళన చెందవచ్చునన్న కేంద్రం వాదనను కోర్టు కొట్టివేసింది. మీ మైండ్ సెట్ మారాలి […]

ఆర్మీలో 'ఆమె'కు అందలం.. సుప్రీంకోర్టు  ఆదేశం
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 17, 2020 | 5:41 PM

Share

భారత సైన్యంలో మహిళలకు కూడా సమున్నత పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైన్యంలో పురుష అధికారులతో సమానంగా కల్నల్ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి పోస్టులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే సైన్యంలో వారికి శాశ్వత కమిషన్ ఉండాలన్న  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సైన్యంలో  ఎక్కువగా గ్రామీణ మహిళలు చేరుతున్నారని, వీరి కారణంగా పురుష అధికారులు ఆత్మన్యూనతతో ఆందోళన చెందవచ్చునన్న కేంద్రం వాదనను కోర్టు కొట్టివేసింది. మీ మైండ్ సెట్ మారాలి అని చురకలు వేసింది. ఆర్మీలో మహిళలకు ఎన్ని ఏళ్ళ సర్వీసు ఉన్నా..శాశ్వత కమిషన్ వల్ల కలిగే ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని స్పష్టం చేసిన కోర్టు.. మూడు నెలల్లోగా ఈ కమిషన్ ను  ఏర్పాటు చేయాలని  ఆదేశించింది. ‘పురుష సిబ్బందితో సమానంగా మహిళలకు కూడా అపాయింట్ మెంట్లు ఉండాలి.. అసలు  మీరు ‘జెండర్ వివక్ష ‘చూపుతున్నారు’ అని కూడా కోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. కాగా-సుప్రీం తీర్పు పట్ల సైన్యంలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు