Business: నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించడమెలా?

How to Start a ATM Bank Business: ఇప్పుడు యువత కష్టపడకుండానే డబ్బులను సంపాదించే మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటి వలన కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరు నష్టాల బారిన పడుతున్నారు. కానీ దేనినైనా తెలివిగా చేస్తే తప్పకుండా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దగ్గరినుంచీ డబ్బుల లావాదేవీలు మరింత సులువయ్యాయి. ఏటీఎంలు దాదాపు 9 రకాల సేవలను అందిస్తున్నాయి. తాజాగా […]

Business: నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించడమెలా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 9:59 PM

How to Start a ATM Bank Business: ఇప్పుడు యువత కష్టపడకుండానే డబ్బులను సంపాదించే మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటి వలన కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరు నష్టాల బారిన పడుతున్నారు. కానీ దేనినైనా తెలివిగా చేస్తే తప్పకుండా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దగ్గరినుంచీ డబ్బుల లావాదేవీలు మరింత సులువయ్యాయి. ఏటీఎంలు దాదాపు 9 రకాల సేవలను అందిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ని ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా ‘వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని’ తెరపైకి తీసుకొచ్చింది ఆర్బీఐ. ఇప్పటికే వివిధ బ్యాంకింగ్ సంస్థలు ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో 12 సంస్థలకు ఆర్బీఐ లైసెన్స్‌లు కూడా కేటాయించింది. అంతేకాకుండా ఈ కంపెనీలు ఏటీఎం‌లను ఏర్పాటు చేసే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి.

ఏటీఎంను నెలకొల్పడం ఎలా?

మీరు ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందు బిజీగా ఉన్న మార్కెట్‌లో 25 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు టై అప్ అయిన బ్యాంక్ లేదా కంపెనీ.. మీకు ‘వైట్ లేబుల్ ఏటీఎం’లను అందిస్తాయి. వాటిని మీరనుకున్న ప్రాంతంలో లేదా ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏటీఎం నిర్వహణా ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, సేఫ్టీ ప్రికాషన్స్‌ని మీరే భరించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏర్పాటు చేసుకున్న ఏటీఎం ద్వారా ఎన్ని నగదు ట్రాన్సాక్షన్స్ జరిగితే అంత అమౌంట్ మీ అకౌంట్‌లోకి జమ అవుతాయి. అంటే ఒక్కో ట్రాన్సాక్షన్‌కి ఇంత అని బ్యాంక్ మీకు కేటాయిస్తుంది. దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి.

ఉదాహరణకి.. మీ ఏటీఎంలో ప్రతీ రోజూ 100 నగదు లావాదేవీలు జరిగితే అందులో 25 నాన్ ఫైనాన్స్, 75 నగదు ఉపసంహరణలు జరిగితే.. సుమారు రోజుకు రూ.1500 సంపాదించవచ్చు. అంటే నెలకి రూ.45 వేలు సంపాదించవచ్చు. అలా మీ ఏటీఎం ద్వారా ఎన్ని నగదు లావాదేవీలు జరిగితే మీకు అంత లాభం అన్నమాట. అయితే ఇందులో మీరు ఏటీఎం నిర్వహణ ఖర్చులు తీయగా ఎంత మిగిలితే అంత మీదే అన్నమాట. దీనికి సంబంధించిన మరింత సమచారం కోసం ఆర్బీఐ బ్యాంక్ డాట్ కమ్‌ను లాగిన్ అవ్వాలి.