Sangameshwara Temple: నదీగర్భంలో వెలుగు చూస్తున్న జంగమ దేవుడు
Samgameshwara Temple in Krishna river: నదీగర్భంలో నెలవైన జంగమదేవుడు ఆరు నెలల తర్వాత మెల్లిగా వెలుగులోకి వస్తున్నాడు. నిండుకుండగా మారిన కృష్ణమ్మ ఒడి వీడి భక్తుల పూజలందుకునేందుకు సిద్దమవుతున్నాడు. సప్తనందుల క్షేత్రమైన సంగమేశ్వరాలయం గోపుర శిఖరం తేలడంతో సంగమేశ్వరునికి పూజలు చేసేదెప్పుడా అని శివభక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి గత సంవత్సరం పలు మార్లు వరద నీరు పోటెత్తడంతో 11 సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్ల ఎత్తిన […]
Samgameshwara Temple in Krishna river: నదీగర్భంలో నెలవైన జంగమదేవుడు ఆరు నెలల తర్వాత మెల్లిగా వెలుగులోకి వస్తున్నాడు. నిండుకుండగా మారిన కృష్ణమ్మ ఒడి వీడి భక్తుల పూజలందుకునేందుకు సిద్దమవుతున్నాడు. సప్తనందుల క్షేత్రమైన సంగమేశ్వరాలయం గోపుర శిఖరం తేలడంతో సంగమేశ్వరునికి పూజలు చేసేదెప్పుడా అని శివభక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి గత సంవత్సరం పలు మార్లు వరద నీరు పోటెత్తడంతో 11 సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్ల ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నిండుకుండలా వుండడంతో నదీగర్భంలో వెలసిన సంగమేశ్వరుని ఆలయ ప్రాంగణమంతా గత 6 నెలలుగా కృష్ణమ్మ ఒడిలోనే వుండిపోయింది. తాజాగా బయట పడుతున్న సప్త నదుల సంగమమైన సంగమేశ్వరాలయ గోపురం బయటపడుతుండడంతో శివభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రికి సంగమదేవుని దర్శనమయ్యే అవకాశముందంటూ వారు సంతోషపడుతున్నారు.
Also read: YCP love for BJP is one side ?
శ్రీశైలం జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 866 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వరాలయం శిఖర భాగం బయటపడింది. మరో 35 అడుగుల నీటిమట్టం తగ్గితే పూర్తి స్థాయిలో సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. గతేడాది ఆగస్టులో కృష్ణమ్మ ఒడిలోకి చేరిన సంగమేశ్వరాలయ గోపురం ఆరు నెలల తర్వాత దర్శనమిచ్చింది.