ఇదే తుది తీర్పు కావాలి: ఆశాదేవి

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, తాజాగా పాటియాలా కోర్టు  జారీచేసిన డెత్ వారెంట్ ల నేపథ్యంలో ఈసారైనా మార్చి 3న తప్పనిసరిగా దోషులకు ఉరి శిక్ష […]

ఇదే తుది తీర్పు కావాలి: ఆశాదేవి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 4:42 PM

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, తాజాగా పాటియాలా కోర్టు  జారీచేసిన డెత్ వారెంట్ ల నేపథ్యంలో ఈసారైనా మార్చి 3న తప్పనిసరిగా దోషులకు ఉరి శిక్ష పడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇదే తుది తీర్పు కావాలని కూడా ఆశిస్తున్నట్లు తెలిపింది.

డిసెంబరు 16, 2012న ఢిల్లీలో ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ముఖేశ్ కుమార్ సింగ్, పవన్, వినయ్, అక్షయ్ దోషులు. వీరికి మరణ శిక్షలు ఖరారయ్యాయి. అయితే వీరు రకరకాల పిటిషన్లతో ఈ శిక్షల అమలులో జాప్యం జరిగేలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకు చెక్ పెడుతూ ట్రయల్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.