AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి సోనియా గాంధీ హాజరుపై జోరుగా చర్చ.. స్పందించిన కాంగ్రెస్..

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నూతన సంవత్సరం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. ఈ ఆలయ నిర్మాణంతో దాదాపు 600 ఏళ్ల నాటి కల సాకారమైందని కొందరు హిందూ భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ మహాత్సవాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తిలకించేందుకు యావత్ భారతం ఎదురు చూస్తోంది.

Sonia Gandhi: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి సోనియా గాంధీ హాజరుపై జోరుగా చర్చ.. స్పందించిన కాంగ్రెస్..
Sonia Gandhi
Srikar T
| Edited By: |

Updated on: Feb 22, 2024 | 8:13 PM

Share

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నూతన సంవత్సరం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. ఈ ఆలయ నిర్మాణంతో దాదాపు 600 ఏళ్ల నాటి కల సాకారమైందని కొందరు హిందూ భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ మహాత్సవాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తిలకించేందుకు యావత్ భారతం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల ముఖ్య నేతలకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కొందరు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందులో ప్రతిపక్షనేతలు సోనియా, మల్లిఖార్జున ఖార్గే, లోక్ సభ సభ్యులు అధిర్ రంజన్ కూడా ఉన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వస్తారా.. రారా.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. దీనిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరామ్ రమేష్ స్పందించారు. త్వరలోనే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరుపై స్పష్టత వస్తుందని తెలిపారు. తగిన సమయంలో నిర్ణయం తీసుకొని తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్న నేపథ్యంలో తమకు మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందలేదని కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. అందులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎తోపాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ సభ్యుల కపిల్ సిబాల్ ఉన్నారు. ఇదిలా ఉంటే కొందరు ముఖ్య నేతలు మాత్రం ఈ కార్యక్రమానిక దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ఆ పార్టీ నాయకురాలు బృందా కారత్ హాజరుకావడం లేదని ప్రకటించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరుకాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొన్ని పార్టీలు వెళ్లాలని తహతమలాడుతుంటే.. మరి కొందరు దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నందును వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే జనవరి 16 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠోత్సవం ఏడు రోజుల పాటు సాగనుంది. 22న రామ్ లీలా విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. దీంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఉత్తర్‎ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు 6,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం కోసం నరేంద్ర మోదీ శనివారం అయోధ్య నగరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్‎ను కూడా ఆధునిక హంగులతో నిర్మించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!