AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Mamata Banerjee: పార్టీ నేత బొజ్జపై దీదీ సెటైర్లు.. పగలబడి నవ్విన టీఎంసీ కార్యకర్తలు..

ఈ సమావేశంలో ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నించడం మొందలు పెట్టారు. వారు అడుగుతున్నవాటికి జవాబులు మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో ఓ భారీకాయుడి వంతు..

CM Mamata Banerjee: పార్టీ నేత బొజ్జపై దీదీ సెటైర్లు.. పగలబడి నవ్విన టీఎంసీ కార్యకర్తలు..
Cm Mamata Banerjee On Belly
Sanjay Kasula
|

Updated on: May 31, 2022 | 5:04 PM

Share

Mamata Bannerji: సీరియస్‌గా ఉండటమే కాదు సరదా మాట్లాడటం.. నవ్వించడం మొదలు పెట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Bannerji,).  పురిలియాలో జరిగిన సమావేశంలో కార్యకర్తలతో కాసేపు నవ్వులు పూయించారు. ఈ సమావేశంలో ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నించడం మొందలు పెట్టారు. వారు అడుగుతున్నవాటికి జవాబులు మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో ఓ భారీకాయుడి వంతు వచ్చింది. అతడు మమతతో ఏదో విషయం చెబుతుండగా.. ఆమె మధ్యలో కలగజేసుకున్నారు. ‘బస్తా లాంటి నీ పొట్ట చూస్తుంటే ఏదో ఒక రోజు నువ్వు కుప్పకూలిపోతావ్ అనిపిస్తుంది..? నీ ఆరోగ్యం బాగానే ఉందా.. అని ప్రశ్నించారు. అందుకు అతను బదులిస్తూ.. ‘నాకు షుగర్, బీపీ లాంటివి ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నాను మేడం అంటూ జవాబు చెప్పడమే కాదు తాను రోజూ వర్కవుట్లు కూడా చేస్తానని దీదీని నమ్మించే ప్రయత్నం చేయబోయాడు. ఆమె మాత్రం అసలు నమ్మలేదు. ‘నీకు కచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. నీ మధ్యప్రదేశ్ చాలా భారీగా ఉంది.. అంటూ అతడిని మరింత ఇరకాటంలో పడేశారు. అయితే పొట్ట పెరగడానికి అసలు కారణమేంటో చివరకు అతను వెల్లడించాడు. తానూ రోజు ఉదయం పకోడీలు, బజ్జీలు తింటానని, అది చిన్నప్పటి నుంచి అలవాటని నిజం కక్కేశాడు. కానీ రోజూ ఎక్సర్​సైజ్ చేస్తానని మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయబోయాడు.

అయితే అతని కట్టు కథలు విని దీదీ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. పొద్దు పొద్దున్నే పకోడీలు ఎందుకు తింటున్నావ్..? అలా తింటే నీ పొట్ట ఎప్పటికీ కరగదు. నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నావో చెప్పు. నువ్వు ఎలాంటి ఎక్సర్​సైజ్ చేస్తావో చెప్పు..? అని అడిగారు. అందుకు అతను బదులిస్తూ ‘నేను రోజు ప్రాణాయామం చేస్తా. 1000 సార్లు శ్వాస పీల్చి వదులుతా’ అని అన్నాడు. అందుకు దీదీ స్పందిస్తూ ‘అది అసాధ్యం. నేను నమ్మను. నువ్వు ఇప్పుడు 1000 సార్లు చేసి చూపిస్తే నీకు రూ.10వేలు ఇస్తా.. అంటూ సవాల్ విసిరారు. నీకు ప్రాణాయామంలో శ్వాస ఎలా తీసుకోవాలో, ఎలా వదలాలో కూడా తెలియదని మరింత చిక్కులోకి నెట్టేశారు. ఇక చేసేది లేక కూర్చుండి పోయాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తనతో మాట్లాడిన జల్ధా మేయర్ సురేశ్​ బరువు 125 కిలోలు అని తెలిశాక దీదీ మరోసారి గట్టిగా నవ్వారు. ఆ తర్వాత అతనికి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఇంత బరువు ఉన్న నువ్వు వెంటనే పకోడీలు తినడం మానెయ్.. వ్యాయామం మొదలుపెట్టు.. అప్పుడే పొట్ట కరుగుతుంది. నెల రోజులు అన్నమే తిను. రాత్రిపూట తిన్న తర్వాత ఒక కిలోమీటర్ నడువు.. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఉండు.. నువ్వు ఇలా చేస్తున్నావో లేదో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. దీదీ అందరిముందు తన పొట్ట, బరువు గురించి మాట్లాడినా సురేశ్ మాత్రం అవమానంగా భావించలేదు. దీదీ సలహాను కచ్చితంగా ఆచరిస్తానని చెప్పుకొచ్చాడు.