AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMEGP: ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన పథకంపై కేంద్రం కీలక నిర్ణయం! 13 వేల కోట్లతో 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..

ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామును (PM's Employment Generation Programme) మరోమారు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (మే 30) ప్రకటించింది. దీంతో రూ.13,554.42 కోట్లతో 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు..

PMEGP: ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన పథకంపై కేంద్రం కీలక నిర్ణయం! 13 వేల కోట్లతో 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
Pmegp Scheme
Srilakshmi C
|

Updated on: May 31, 2022 | 4:52 PM

Share

Government extends PMEGP till FY2025-26: ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామును (PM’s Employment Generation Programme) మరోమారు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (మే 30) ప్రకటించింది. దీంతో రూ.13,554.42 కోట్లతో 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెల్పింది. ఈ పథకం కింద మొత్తం 5 (2021-22 నుండి 2025-26 వరకు) ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించనుందని యోచిస్తున్నట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా కమిషన్‌ ఇప్పటికే పలు మార్లు ఫినాన్షియల్‌ సైకిల్‌ను పొడిగించింది. ప్రస్తుతం 15వ ఫైనాన్స్ సైకిల్‌ నడుస్తోంది. గడువు పొడిగింపుతో పాటు, ప్రస్తుత పథకంలో కొన్ని ప్రధాన మార్పులు కూడ చేస్తున్నట్లు తెల్పింది.

PMEGP చోటుచేసుకోనున్న ప్రధాన మార్పులు ఇవే..

ఇవి కూడా చదవండి
  • మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల గరిష్ట ప్రాజెక్టు వ్యయం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సర్వీస్ యూనిట్లకు ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల వ్యయపరిమితిని రూ.20 లక్షల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • పంచాయతీ రాజ్ కిందకు వచ్చే ప్రదేశాలను ఇకమీదట గ్రామీణ ప్రాంతాలుగా పరిగణించనున్నారు.
  • మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాలు పట్టణాల పరిధిలోకి వస్తాయి.
  • అలాగే రూరల్, అర్బన్ కేటగిరీ అనే భేదాలు లేకుండా అప్లికేషన్లు అన్నింటిని ప్రాసెస్ చేసేలా ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది కేంద్రం.
  • పీఎమ్‌ఈజీపీ సబ్సిడీ దరఖాస్తు ఫాంలో థార్డ్‌ జండర్‌ కేటగిరీని కూడా చేర్చనున్నారు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు, ఎన్‌ఈఆర్, సరిహద్దు జిల్లాల అభ్యర్థులకు పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ కాస్ట్‌లో 25 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం సబ్సిడీ ఇస్తారు.
  • జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులకు.. పట్టణ ప్రాంతంలో ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీని అందజేయనుంది.
  • పీఎమ్‌ఈజీపీ పథకం 2008-09లో ప్రారంభమైనప్పటి నుంచిజజ సుమారు 7.8 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లకు ఈ పథకం కింద రూ.19,995 కోట్ల సబ్సిడీ సహాయం అందింది. దీని ద్వారా 64 లక్షల మందికి స్థిరమైన ఉపాధిని కల్పించడం జరిగింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.