Tamil Nadu: తమిళనాడులో సరికొత్త కాంట్రవర్సీ.. యూనివర్సిటీ ఎగ్జామ్‌లో కుల ప్రస్తావన..

Periyar University Exam Triggers Row: తమిళనాడులో సరికొత్త కాంట్రవర్సీ నడుస్తోంది. యూనివర్సిటీ స్థాయి ఎగ్జామ్‌లో కుల ప్రస్తావన తీసుకురావడం అగ్గిరాజేస్తోంది.

Tamil Nadu: తమిళనాడులో సరికొత్త కాంట్రవర్సీ.. యూనివర్సిటీ ఎగ్జామ్‌లో కుల ప్రస్తావన..
Periyar University
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2022 | 8:14 AM

Periyar University Exam Triggers Row: తమిళనాడులోని పెరియార్ యూనివర్శిటీ పరీక్షలో కుల సంబంధిత ప్రశ్న సంచలనం రేపుతోంది. తమిళనాడుకు చెందిన లోయర్‌ క్యాస్ట్‌ దిగువ కులం ఏది అంటూ ఎగ్జామ్‌లో క్వశ్చన్‌ అడిగారు. ఈ ప్రశ్నకు కింద నాలుగు కులాల ఆప్షన్స్‌ ఇచ్చారు. ఈ ఆప్షన్స్‌లో ఏది సరైందో గుర్తించి జవాబు రాయాలని పేర్కొన్నారు. ఫస్టియర్‌ రెండో సెమిస్టర్ మాస్టర్ ఇన్ హిస్టరీ విద్యార్థులకు ఈ ప్రశ్న అడిగారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో వివాదంగా మారింది. ఈ విషయంపై పెరియార్ యూనివర్సిటీ వైన్‌చాన్స్‌లర్‌ స్పందించారు. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు వైస్‌ ఛాన్సలర్‌ జగన్నాథన్‌. కులానికి సంబంధించిన ప్రశ్నను మరో యూనివర్సిటీ సిద్ధం చేసిందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. “పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను పెరియార్ విశ్వవిద్యాలయం తయారు చేయదని స్పష్టం చేశారు. ఇతర విశ్వవిద్యాలయాలు, కళాశాల లెక్చరర్లు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేశారని వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్‌ నివారణ కోసం తాము పరీక్ష ముందు ప్రశ్నపత్రాన్ని చదవమని స్పష్టం చేశారు. దీనిపై తనకెలాంటి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. వివాదాస్పద ప్రశ్నపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు వీసీ. ప్రశ్న పత్రాన్ని సెట్ చేసిన సంబంధిత అధికారి నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. తిరిగి పరీక్ష నిర్వహించే ఆలోచన లేదన్నారు వీసీ.

ఎగ్జామ్‌ పేపర్లలో వివాదాస్పద అంశాలకు చోటివ్వడం నిషేధం. నిపుణులు మాత్రమే పరీక్ష పేపర్‌ను తయారు చేస్తారు. పేపర్‌ తయారీ తర్వాత సమగ్ర పరిశీలన ఉంటుంది. ఇన్ని దశలు దాటిన తర్వాతే.. క్వశ్చన్‌ పేపర్‌ రూపుదిద్దుకుంటుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థలోనూ ఇలాంటి పొరపాట్లు జరగడంపై దుమారం చెలరేగుతోంది. సున్నిత అంశాల జోలికెళ్లడంపై రచ్చ రాజుకుంటోంది.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..