Helicopter Crash: హెలికాఫ్టర్ల ప్రమాదానికి కారణాలు.. ఇప్పటి వరకూ దేశంలో మరణించిన ప్రముఖుల వివరాలు..

Helicopter Crash: నల్గొండ జిల్లా(Nalgonda District)లో ఈరోజు మరో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ పైలట్‌తో పాటు, ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. అయితే నేల విడిచి నింగిలో ప్రయాణం చేయడానికి..

Helicopter Crash: హెలికాఫ్టర్ల ప్రమాదానికి కారణాలు.. ఇప్పటి వరకూ దేశంలో మరణించిన ప్రముఖుల వివరాలు..
Helicopter Crash
Follow us

|

Updated on: Feb 26, 2022 | 2:47 PM

Helicopter Crash: నల్గొండ జిల్లా(Nalgonda District)లో ఈరోజు మరో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ పైలట్‌తో పాటు, ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. అయితే నేల విడిచి నింగిలో ప్రయాణం చేయడానికి హెలికాప్టర్లు(Helicopter)లేక చాపర్ల(chopper)ను చాలా మంది ప్రముఖులు ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ ప్రయాణం ఎంత వేగవంతమో.. అంత ప్రాణాపాయం కూడా.. ప్రపంచంలో ఎక్కడో ఏదొక చోట .. హెలికాప్టర్లు లేక చాపర్లకు ప్రమాదం జరిగింది అన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అవును హెలికాప్టర్లు, విమానాలు మరింత అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా పెరిగాయి. అయితే ఇలా హెలికాప్టర్లు లేక చాపర్లు ప్రమాదానికి గురికావడానికి అనేక రకాలైన కారణాలున్నాయి.  వాతావరణంలో మార్పులు.. తక్కువ ఎత్తులో మబ్బులు,  మంచు ప్రభావం వలన హెలికాప్టర్లు లేక చాపర్లను నడిపే ఫైలెట్ కు కింద ఏముందో సరిగా కనపడక పోవడం వలన కూడా ప్రమాదం సంభవించే అవకాశం అధికంగా ఉంది. హెలికాప్టర్లు లేక చాపర్ల తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తూ.. చెట్లు వంటి వాటిని ఢీకొనడం, పక్షులు, ఎత్తైన పోల్స్ ఢీకొట్టడం వంటి ఇతర కారణాల వలన కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక గాలిలో అధికంగా తేమ, మోస్తరుగా వాన, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు, హెలికాఫ్టర్ లో తలెత్తే సాంకేతిక సమస్యలు, మానవతప్పిదాలు వంటి ఇతరకారణాల వలన కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత కొంతకాలంగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలు.. ఈ ఘటనల్లో మరణించిన ప్రముఖుల వివరాల్లోకి వెళ్తే..

  1. ఫిబ్రవరి26, 2022 నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో కుప్పకూలిన మినీ చాపర్.. విద్యుత్‌ స్తంభంపై కూలిన విమానం, ముక్కలు ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో  మృతి చెందిన మహిళ పైలట్‌, ట్రైనీ పైలట్. ఈ మినీ చాపర్ ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 152 మోడల్ టూ సీటర్ చాపర్‌. నాగార్జున సాగర్ ఎయిర్‌ బేస్‌ నుంచి టేకాఫ్ అయిన చాపర్.. సాంకేతిక సమస్యనే కారణం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిన హెలికాప్టర్‌ పేరు CESSNA-152.
  2. 2021 డిసెంబర్8..భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు మధ్య హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
  3.  2004 ఏప్రిల్17 బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం పక్కన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రముఖ నటి సౌందర్య .. ఆమె సోదరుడు అమరనాథ్ సహా సజీవ దహనమయ్యారు.
  4.  1980 జూన్23..ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ హెలికాఫ్టర్ ఢిల్లీ సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే కూలి స్పాట్ లోనే సంజయ్ గాంధీ మరణించారు.
  5.  2001, సెప్టెంబర్ 30..యూపీలోని కాన్పూర్‌కు బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళుతుండగా హెలికాఫ్టర్ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా మృతి చెందారు.
  6.  2002, మార్చి3..లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం చోటు చేసుకుంది. భీమవరం నుంచి తిరిగివస్తుండగా కువ్వడలంక గ్రామం వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి.. హెలికాఫ్టర్ కొబ్బరి చెట్టును ఢీకొట్టి మీపంలోని చేపల చెరువులో కూలింది. ఈ ఘటనలో బాలయోగి అక్కడిక్కడే మృతి చెందారు.
  7.  2009 సెప్టెంబర్3 వైఎస్ రాజశేఖర్ రెడ్డి బెల్ 430 హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాఫ్టర్ నల్లమలలోని పావురాలగుట్ట వద్ద కూలింది. ఈ ఘటనలో వైఎస్ తో పాటు ఐదుగురు మృతి చెందారు.
  8.  2011 అరుణాచల్ ప్రదేశ్ సిఎం ధోర్జీ ఖండూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగా జరిగింది.  హెలికాఫ్టర్ లోబో తాండ్ వద్ద కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీఎం దోర్జీ ఖండూతో సహా ఐదుగురు మృతి చెందారు.
  9.  2005 మార్చి31 న జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదం మృతి చెందారు. జిందాల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ యూపీలోని సహారన్ పూర్ లో కుప్పకూలింది.
  10. 2001 అరుణాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి డేరా నాథుండ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డేరా నాథుండ్ మృతి చెందారు.
  11. 2004 హెలికాప్టర్ ప్రమాదంలో మేఘాలయ మంత్రి సంగ్మా, ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా 10 మంది మృతి చెందారు.
  12.  1973 మే31…కాంగ్రెస్ మాజీ ఎంపీ మోహన్ కుమారమంగళం విమానం ప్రమాదాంలో మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో మృతదేహాలు చెదిరిపోగా.. మోహన్ కుమారమంగళం మృత దేహాన్ని పార్కర్ పెన్, ఆయన ధరించిన వినికిడి యంత్రం సహాయంతో గుర్తించారు.
  13.  1945 ఆగస్టు18..సుభాష్ చంద్రబోస్ తైవాన్‌ విమాన ప్రమాదంలో చనిపోయారని ఒక కథనం వినిపిస్తుంటుంది.

Also Read:

రష్యాపై స్విఫ్ట్ ప్రయోగం? ఆర్థిక మూలాలపై దాడికి సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలు!

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..