విచక్షణ కోల్పోయిన వదిన.. మరిది మర్మాంగాలపై దాడి.. అదే కారణమా..
సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. విచక్షణ కోల్పోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబంధీకులనూ...
సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. విచక్షణ కోల్పోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబంధీకులనూ హత్య చేసేందుకు వెనుకాడటం లేదు. క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా కాన్పూర్ లో జరిగిన ఓ ఘటనను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. విభేదాల కారణంగా మరిదిపై వదిన దాడి(Attack) చేసింది. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో మర్మాంగాలపై కత్తితో దాడి చేసింది. అడ్డుకోబోయిన అత్తపై కూడా దాడి చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు(Police case) నమోదు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్(kanpur) లోని బాదల్ నివాడా గ్రామానికి చెందిన అన్నాదమ్ముల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. విభేదాల కారణంగా వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తమ్ముడిపై అన్నావదినలు కక్ష పెంచుకున్నారు.
ఆరు బయట మంచంపై పడుకున్న మరిదితో వదిన ఘర్షణకు దిగింది. మాటా మాటా పెరిగింది. ఆ కోపంలో పదునైన ఆయుధంతో మరిది మర్మాంగాలపై దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న బాధితుడి తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె పైనా దాడి చేసింది. ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు మరిది తనను వేధిస్తున్నాడని వదిన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Also Read
మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే మీరు హైబీపీ బారిన పడినట్లే..
India Covid-19: బిగ్ రిలీఫ్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?