Wife Caught: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. సడెన్‌గా వచ్చిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Wife Caught: అతనో ప్రభుత్వాధికారి.. మంచి పొజిషన్.. మంచి జీతం కూడా వస్తుంది. అతనికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు.

Wife Caught: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. సడెన్‌గా వచ్చిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Wife Caught
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2022 | 3:48 PM

Wife Caught: అతనో ప్రభుత్వాధికారి.. మంచి పొజిషన్.. మంచి జీతం కూడా వస్తుంది. అతనికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతని వక్ర బుద్ధి పక్క చూపులు చూసేలా ప్రేరిపించింది. ఇంకేముంది.. డబ్బుంది, పదవి ఉంది.. అమ్మాయిలకు వల వేశాడు. ఓ అమ్మాయి చిక్కింది. తాజాగా తన ప్రేయసితో కలిసి గదిలో ఏకాంతంగా ఉన్నారు. ఇద్దరూ సంతోషంగా ఒకరికొకరు దోష తినిపించుకుంటున్నారు. ఇంతలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సడెన్‌గా అతని భార్య, బంధువులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బడిత పూజ చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఎవరా అధికారి.. ఎక్కడ జరిగిందీ ఘటన అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకెళితే.. బాండా జిల్లాలోని ప్రభుత్వ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజనీర్‌(JE)గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ విశ్వకర్మ తన ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేస్తూ అతని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రత్యేక గదిలో ఇద్దరూ కూర్చుని దోసను ఒకరికొకరు తినిపించుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో ఉన్నారు. వీరంతా కలిసి వారిద్దరికీ దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. కాగా, తన భర్తకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అతని భార్య ఆరోపించింది.

ఇదిలాఉంటే.. 50 మంది చిన్నారులతో చైల్డ్ పోర్నోగ్రఫీ తీసిన నీటిపారుదల శాఖ జేఈ ఉదంతం కూడా ఉత్తరప్రదేశ్‌లోని బాండాలోనే చోటు చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే.. బాండాలో మరో జేఈ వ్యవహారం బటయపడటం చర్చనీయాంశమైంది.

ప్రియురాలిపై మోజుతో భార్యను సిగరెట్‌తో కాల్చి.. దంకౌర్ పట్టణంలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రేయసితో కలిసి ఉన్న విషయం తెలుసుకున్న భార్య.. తన భర్త కుటుంబ సభ్యులను తీసుకెళ్లి మరీ అతని గుట్టును రట్టు చేసింది. తన భర్త మరో మహిళతో ఉండగా బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వీరందరూ కలిసి ఆ వ్యక్తి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తన భర్త మహిళపై మోజుతో తనకు నరకం చూపెట్టాడని ఆరోపించింది బాధిత మహిళ. సిగరెట్‌తో కాల్చి ఆనందించేవాడని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

suma kanakala : యాంకర్ సుమ కనకాల బ్యూటీఫుల్ లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ

Puneet Rajkumar: పునీత్ చివరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్..

Bigg Boss Non-Stop: బిగ్ బాస్ షోపై CPI నారాయణ సంచలన కామెంట్స్.. వ్యభిచార గృహమంటూ..