Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneet Rajkumar: పునీత్ చివరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఆయన అభిమానులతోపాటు అని ఇండస్ట్రీల స్టార్స్ ను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింది.

Puneet Rajkumar: పునీత్ చివరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్..
Puneeth Rajkumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2022 | 3:40 PM

Puneet Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఆయన అభిమానులతోపాటు అని ఇండస్ట్రీల స్టార్స్ ను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింది. పునీత్ గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్. పునీత్ఈ మరణించే సమయానికి జేమ్స్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే డబ్బింగ్ మాత్రం కాలేదు. పునీత్ వాయిస్ ను మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా ప్రయతించినా కూడా వర్కౌట్ అవ్వలేదట.. దాంతో పునీత్ పాత్రకు ఆయన అన్న శివకుమార్ డబ్బింగ్ చెప్పారు. తమ్ముడి పాత్రకు డబ్బింగ్ చెప్తూ.. చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారట శివన్న. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలను సిద్ధం అయ్యింది. ఈ సినిమాను పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17వ తారీకున కన్నడంతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తో పాటు ఆయన ఇద్దరు అన్నలు కూడా కీలక పాత్రల్లో గెస్ట్ లుగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఈవెంట్ కు అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోస్ హాజరుకానున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ నుండి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు ఎన్టీఆర్ లు హాజరుకానున్నారని అంటున్నారు. పునీత్ కుటుంబానికి మెగాస్టార్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ ఫ్యామిలీకి ఆత్మీయుడు. పునీత్ సినిమాలో తారక్ ఓ పాట కూడా పాడాడు. వీరే కాదు మన హీర్లకు ఎంతో మందికి పునీత్ మంచి మిత్రుడు. పునీత్ మరణించిన సమయంలో టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనను కడసారి చూసేందుకు వెళ్లిన విషయం తెలియందే. Chiranjeevi, Ntr

Chiranjeevi, Ntrమరిన్ని ఇక్కడ చదవండి : 

Meenakshi Chaudhary: అందాలు ఆరబోస్తున్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ.

Shilpa Shetty: వయసు తో పాటు పెరుగుతున్న అందం.. శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?