Russia-Ukraine Crisis: రష్యాపై స్విఫ్ట్ ప్రయోగం? ఆర్థిక మూలాలపై దాడికి సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలు!

అంతర్జాతీయ నగదు లావాదేవీల్లో కీలకమైన స్విఫ్ట్ పేమెంట్ నెట్‌వర్క్ నుంచి రష్యాను వెలివేయాలని డిమాండ్ చేస్తోంది ఉక్రెయిన్.

Russia-Ukraine Crisis: రష్యాపై స్విఫ్ట్ ప్రయోగం? ఆర్థిక మూలాలపై దాడికి సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలు!
Swift On Russia
Follow us

|

Updated on: Feb 26, 2022 | 2:35 PM

Russia-Ukraine Crisis: అంతర్జాతీయ నగదు లావాదేవీల్లో కీలకమైన స్విఫ్ట్(Swift) పేమెంట్ నెట్‌వర్క్ నుంచి రష్యాను వెలివేయాలని డిమాండ్ చేస్తోంది ఉక్రెయిన్(Ukraine).. మరోవైపు రష్యా(Russia)ను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి శక్తివంతమైన ఆయుధంగా స్విఫ్ట్ ను ఉపయోగించేందుకు సిద్ధమైన అమెరికా, ఈయూదేశాల కూటమి. ఇప్పటికే రష్యా ఆర్థిక మూలస్తంభాలపై అమెరికా సహా పలుదేశాలు ఆంక్షల కొరడా ఝళిపిస్తోంది. సైనిక సహాయం ఎలాగూ చేయడంలేదు.. ఆర్థికంగా రష్యాను దెబ్బతీయండని అమెరికా, బ్రిటన్, ఈయూ, నాటో దేశాలను డిమాండ్ చేస్తున్న ఉక్రెయిన్.. ఒకవేళ రష్యాను స్విఫ్ట్ పేమెంట్ నెట్ వర్క్ నుంచి తొలగించకపోతే ఆపాపం మీకు అంటుకుంటుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇదిలావుంటే, ఈ పరిమితులు ప్రధానంగా ఆర్థిక కార్యకలాపాలపై ఉన్నాయి. ఈ పాశ్చాత్య ఆంక్షల వల్ల రష్యా నిజంగా ప్రభావితమవుతుందా లేదా మునుపటి కంటే బలంగా ఉందా? అమెరికా మరింత కఠినంగా ఉంటుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్విఫ్ట్ అంటే… సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ (స్విఫ్ట్-ఎస్‌.డబ్ల్యూ.ఐ.ఎఫ్‌.టి) అనేది ఒక అంతర్జాతీయ నగదు లావాదేవీల వ్యవస్థ. సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, చట్టబద్ధంగా SWIFT SCRL, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల మధ్య ఆర్థిక లావాదేవీగా పనిచేసే బెల్జియన్ కో-ఆపరేటివ్ సొసైటీ. ఇది సాఫ్ట్‌వేర్ సేవలను ఆర్థిక సంస్థలకు విక్రయిస్తుంది. ఎక్కువగా దాని యాజమాన్య SWIFTNet, iSO 9362 బిజినెస్ ఐడెంటిఫైయర్ కోడ్‌లు (BIC), దీనిని SWIFT కోడ్‌లుగా పిలుస్తారు. SWIFT బదిలీని ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు.

SWIFT ప్రత్యక్ష ఫండ్ బదిలీ సౌకర్యాన్ని అందించదు. బదులుగా, చెల్లింపు సంస్థల ద్వారా ఆర్డర్ పంపబడిన తర్వాత ఇది జరుగుతుంది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం, ప్రతి ఆర్థిక సంస్థ తప్పనిసరిగా బ్యాంకుల్లో ఒకదానితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. అయితే SWIFT ఆర్థిక సందేశాలను సురక్షితమైన పద్ధతిలో ప్రసారం చేస్తుంది. ఇది దాని సభ్యుల కోసం ఖాతాను నిర్వహించదు. ఎలాంటి క్లియరింగ్ లేదా సెటిల్‌మెంట్ (SWIFT) చేయదు. 2015లో SWIFT 200 కంటే ఎక్కువ దేశాలలో 11,000 ఆర్థిక సంస్థలను కనెక్ట్ చేసింది. సభ్యదేశాల బ్యాంకులకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది స్విఫ్ట్. సభ్య దేశాలకు అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేయడంలో స్విఫ్ట్ తోడ్పడుతుంది. లావాదేవీల్లో వివాదాల పరిష్కారానికి స్విఫ్ట్ నిష్పాక్షికంగా తోడ్పడుతుంది. సగటున రోజుకు 4.20 కోట్ల సందేశాలు స్విఫ్ట్ వ్యవస్థ మాధ్యమంగా పంపబడుతుంటాయి. ప్రతిరోజు ప్రభుత్వాలు, సంస్థల మధ్య జరిగే లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలకు స్విఫ్ట్ సాక్షిగా వ్యవహరిస్తుంటుంది

1973లో ఏర్పాటుచేసిన స్విఫ్ట్ బెల్జియన్ చట్టం ప్రకారం సహకార సంఘంగా, SWIFT దాని సభ్య ఆర్థిక సంస్థల యాజమాన్యంలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని లా హుల్పే, బ్రస్సెల్స్ సమీపంలో ఉంది. SWIFT బ్రస్సెల్స్‌లో 3 మే 1973న స్థాపించబడింది. ఇది CEO, కార్ల్ రాయిటర్‌చైల్డ్ నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. 15 దేశాలలో 239 బ్యాంకులచే మద్దతు ఇవ్వబడింది. దాని ప్రారంభానికి ముందు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు టెలెక్స్ ద్వారా ప్రసారం చేశారు. ప్రపంచ ఆర్థిక ప్రవాహాలపై US నియంత్రణను తగ్గించే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఇది బెల్జియం ప్రధాన కేంద్రంగా పనిచేసే కన్సార్టియం. ప్రపంచ దేశాల మధ్య నగదు బదాలయింపులు అత్యంత వేగంగా సమర్థంగా జరిపేందుకు తోడ్పడుతున్న కన్సార్టియం ఇది. అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య జరిపే లావాదేవీల సమాచారం, సందేశాలను వేగంగా, సురక్షితంగా చేరవేయడం దీని పని స్విఫ్ట్‌ వ్యవస్థతో అనుసంధానమైన బ్యాంకులు తమ మధ్య భారీ చెల్లింపులను సురక్షితంగా జరుపుకునేందుకు తోడ్పడుతుంది. అమెరికా, యూరప్ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన స్విఫ్ట్. అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహా ప్రపంచంలోని ప్రధాన సెంట్రల్ బ్యాంకుల భాగస్వామ్యంతో నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం దీన్ని నిర్వహిస్తోంది

స్విఫ్ట్ వ్యవహారాల్లో రష్యా వాటా.. స్విఫ్టా లావాదేవీల్లో 1 శాతం కంటే ఎక్కువగా రష్యా సంబంధిత చెల్లింపులే ఉన్నాయి. రష్యాకు చెందిన 300 ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ తో అనుసంధానమై ఉన్నాయి. 80శాతానికి పైగా అంతర్జాతీయ సెటిల్ మెంట్స్ ఇవి నిర్వహిస్తుంటాయి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచ దేశాలన్ని ఏకమై శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధం వద్దని వాదిస్తున్నాయి. అయినప్పటికీ రష్యా వెనక్కు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా.. స్విఫ్ట్ నుంచి రష్యా వెలివేతకు డిమాండ్ పెరుగుతోంది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లతో రష్యాతో లింక్ తెగిపోతుంది. రష్యా సంస్థలు ఎగుమతులకు సంబంధించి నగదు అందుకోలేవు. వేల బ్యాంకులు ఉపయోగించే ఈ నెట్‌వర్క్ నుంచి రష్యాను తప్పించడం వల్ల ఆ దేశంలోని బ్యాంకింగ్ నెట్‌వర్క్ అస్తవ్యస్త మవుతుంది. దేశీయ కంపెనీలకు నిధులు అందకుండా పోతాయి. విదేశాల్లో పెట్టుబడులకు ఆటంకం ఏర్పడుతుంది. రష్యా అంతర్జాతీయ వ్యాపారానికి అతిపెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో రష్యా అంతర్జాతీయ వ్యాపారం విలువ 797.9 బిలియన్ డాలర్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

గతంలో స్విఫ్ట్ వెలివేతకు గురైన దేశాలు… గతంలోనూ పలుదేశాలపై కూడా స్విఫ్ట్ అస్త్రాన్ని సంధించాయి ప్రపంచదేశాలు. ఈ క్రమంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలపై ఆగ్రహం చెందిన అమెరికా స్విఫ్ట్ ప్రయోగానికి పూనుకుంది. ఫలితంగా 2012-16లో స్విఫ్ట్ నుంచి వెలివేతకు గురైంది ఇరాన్. క్రూడాయిల్ ఎగుమతుల లావాదేవీలకు సొంత పేమెంట్ వ్యవస్థపై ఆధారపడటంతో ఆర్థికంగా నష్టాలను, కష్టాలను ఎదుర్కొంది. దీంతో 2013లో 40 శాతం క్రూడాయిల్ ఎగుమతులు తగ్గిపోయాయి.

స్విఫ్ట్ నుంచి రష్యా వెలివేతతో ఇతరదేశాలపై ప్రభావం.. స్విఫ్ట్ నుంచి రష్యాను వెలివేస్తే తమ దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపైనా ప్రభావం పడుతుందని పలుదేశాలు భయపడుతున్నాయి. నిషేధానికి గురైన రష్యాకు వస్తువులను ఎగుమతిచేసిన దేశాలు తమకు రావాల్సిన నగదు పొందటంలో ఇబ్బందులు పడతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. రష్యాను నిషేధిస్తే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రష్యా ఎగుమతుల్లో ప్రధానభాగం ఆక్రమిస్తోంది క్రూడాయిల్. రష్యా వెలివేతతో బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరుగుతాయని అంచనా.

రష్యా నిషేధంపై పలుదేశాధినేతల్లో కుదరని ఏకాభిప్రాయం.. స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలని ఉక్రెయిన్, బ్రిటన్ గట్టిగానే పట్టబడుతున్నాయి. ఈమేరకు అమెరికాతో సహా అన్ని దేశాలపై ఒత్తిడికి తీసుకువస్తున్నాయి. మరోవైపు. ప్రస్తుత పరిస్థితులపై వేచిచూసే ధోరణిని పాటిస్తున్నాయి ఈయూ దేశాలు. ఇప్పటికే కరోనా కరోనా కారణంగా రెండేళ్లుగా దెబ్బతిన ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుందని, ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు గురవుతాయంటున్నారు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రూత్. ఇదిలావుంటే, ఇటీవల జరిగిన జీ7 దేశాల భేటీలో రష్యాను వెంటనే వెలివేయాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ డిమాండ్ చేశారు. ఇక, చివరి అస్త్రంగా స్విఫ్ట్ నుంచి వెలివేతను ఉపయోగించాలని భావిస్తున్నా అమెరికా

ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన పలుదేశాలు.. రష్యాకు చెందిన బ్యాంకులపై, విదేశాల్లో నివసిస్తున్న సంపన్నులపై అమెరికా సహా పలుదేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రో వ్‌ ఆస్తులను స్తంభింపచేయాలని నిర్ణయించింది ఈయూ సభ్య దేశాలు. ఈ క్రమంలోనే పుతిన్, సెర్గే లావ్రో వ్ లపై వ్యక్తిగత ఆంక్షలు విధించింది బ్రిటన్. మరోవైపు, కఠిన ఆంక్షలు విధించాలని ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్ కూడా నిర్ణయించాయి. అటు స్విఫ్ట్ నుంచి రష్యాను వెంటనే తొలగించాలని నిర్ణయం చేస్తూ నాటో దేశాల సదస్సులో బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇదిలావుంటే, ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ఈయూ సహా 47 సభ్యదేశాలతో కూడిన మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. రష్యా బ్యాంకులు, వ్యక్తులకు చెందిన ఆస్తులను స్తంభింపచేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది.

ఇదిలావుంటే, ఫిబ్రవరి 21న ఆర్థిక ఆంక్షలను విధించాలని సంబంధిత ఫైల్ పై యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ సంతకం కూడా చేశారు. రష్యా రోజువారీ జరిపే ఆర్థిక లావాదేవీలు 80శాతం వరకు యూఎస్ డాలర్లలో జరుగుతాయి. రష్యా బ్యాంకులు వీఈబీ, ప్రోమ్ స్వైయాజ్ బ్యాంక్ లపై ఆంక్షలు విధించింది అమెరికా. యూఎస్ చట్టాలమేరకు ఈ బ్యాంకుల ఆస్తులను స్తంభింపచేశారు. యూఎస్, ఈయూ మార్కెట్లలో వ్యాపార లావాదేవీల నిలిపివేసింది. ఈ రెండు బ్యాంకులు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్, రష్యా మిలిటరీ కనుసన్నల్లో ఉంటాయి. ఈ బ్యాంకుల ఆస్తుల విలువ 80బిలియన్ డాలర్లు. రష్యాకు చెందిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు, రష్యా రాజకీయ నేతలు, వారసులకు సైతం ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించిన అమెరికా

యునైటెడ్ కింగ్ డమ్ ఐదు రష్యా బ్యాంకులు రోసయ్య బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రోమ్ స్వైయాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ లపై ఆంక్షలు విధించింది యూకే. ముగ్గురు రష్యా బిలియనీర్లు గెన్నడీ టిమ్ చెంకో, బోరిస్ రోటెన్ బెర్గ్, ఐగోర్ రోటెన్ బెర్గ్ లపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టే ఎస్ జీఎం గ్రూప్ సహయజమానులు రోటెన్ బెర్గ్ సోదరులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ యజమాని టిమ్ చెంకో లండన్ లో సావెరిన్ బాండ్ల విక్రయాలపై సైతం నిలుపుదల చేసింది బ్రిటన్.

రష్యా నుంచి ఐరోపా దేశాలకు జర్మనీ గుండా వెళుతున్న 1230 కిలోమీటర్ల నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ ను తాము గుర్తించడం లేదని ప్రకటించిన జర్మనీ. జర్మనీ అనుమతి లేనిదే ఈ పైప్ లైన్ గుండా గ్యాస్ సరఫరా నిలిచిపోనుంది. కాగా, తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటుదారులు ఆధీనంలో ఉన్న ప్రాంతాలను గుర్తించిన, మద్దతు తెలుపుతున్న 351 రష్యన్లపై, ఆంక్షలు విధిస్తూ ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని రెండు తిరుగుబాటు ప్రాంతాలను అనుకూలంగా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 351 రష్యన్ రాజకీయనేతలు, 27 మంది ఇతర రష్యా అధికారులు, రక్షణ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన సంస్థలపై 27 దేశాల ఈయూ కూటమి ఆంక్షలు విధించాయి. దీంతో ఏకగ్రీవంగా ఆంక్షలు విధిస్తూ ప్రకటన చేసింది. అటు ఉక్రెయిన్ దాడులతో సంబంధమున్న వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు, జరిమానాలు విధిస్తున్నట్లు జపాన్, ఆస్ట్రేలియాలు ప్రకటించాయి. తమ దేశంలో రష్యా బాండ్లను, లావాదేవీలను, రష్యా వ్యక్తుల ఆస్తులను స్తంభింపచేస్తున్నట్లు జపాన్ తెలిపింది. జపాన్ లోకి రష్యన్ల రాకను సైతం నిషేధం విధించింది.

Read Also…  

Russian weapons: కదనరంగంలో రంకెలెస్తున్న రష్యా.. ఆ దేశ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలెన్ని?

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు