రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా….?అధ్యయనానికి త్వరలో రీసెర్చర్ల సన్నాహాలు ..?
రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయడానికి (కలపడానికి) గల సాధ్యాసాధ్యాలపై ఇండియాలోని నిపుణులు త్వరలో అధ్యయనాన్ని చేపట్టవచ్చునని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్.కె. అరోరా తెలిపారు.
రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయడానికి (కలపడానికి) గల సాధ్యాసాధ్యాలపై ఇండియాలోని నిపుణులు త్వరలో అధ్యయనాన్ని చేపట్టవచ్చునని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్.కె. అరోరా తెలిపారు. వేర్వేరు వ్యాక్సిన్లను మిశ్రమం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందా అన్న అంశాన్ని కూడా వారు స్టడీ చేస్తారని ఆయన చెప్పారు. ఇండియాలో మరికొన్ని వారాల్లో ఫీజిబిలిటీ టెస్టింగ్ అంటే..ఇలా ఈ రెండింటిపైన వారు ప్రయోగాత్మక పరిశోధనలు చేస్తారన్నారు. కోవిద్ వైరస్ ను నివారించడంలో ఈ మిశ్రమం దోహదపడవచ్చుననడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని, కానీ దీనిపై మొదట అధ్యయనం జరగాలని అన్నారు. ఆగస్టుకల్లా దేశంలో నెలకు 20 నుంచి 25 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఇదిగాక విదేశాల నుంచి కూడా మరో అయిదారు కోట్ల డోసుల టీకామందు అందవచ్చునని అరోరా చెప్పారు.ప్రతి రోజూ ఒక కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు. మొదట ఓ రకం రెండోసారి రెండో డోసుగా మరో టీకామందు తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కేంద్రం ఇటీవల ప్రకటించింది. యూపీలోని సిధార్థనగర్ జిల్లాలో 20 మంది గ్రామీణులకు మొదటి డోసు గా కోవిషీల్డ్ ను, రెండో డోసుగా కొవాగ్జిన్ ను ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణనిచ్చింది.
వేర్వేరు టీకామందులు ఇచ్చినందున కలిగే పరిణామాలపై ఇంకా సమగ్ర పరిశోధనలు జరగాలని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ,కె, పాల్ ఈ మధ్య పేర్కొన్నారు. లాన్సెట్ స్టడీ ప్రకారం ఇలా రెండు రకాల టీకామందులు ఇవ్వడంవల్ల దుష్పరిణామాలు ఉండవన్న అంశాన్ని ఆ జర్నల్ లో రీసెర్చర్లు తెలిపారని, కానీ మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భలే బురిడీ కొట్టించిన యువతి.. ఆకట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..
విద్యుత్ తీగలపై వాక్‌చేస్తోన్న శునకం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.: Dog Viral video.
పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్ వైరల్ వీడియో : Renu Desai Viral video.