AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samriddhi Yojana: ప్రతీ రోజూ రూ. 100 రూపాయల్ సేవ్ చేయండి.. రూ. 15 లక్షలు పొందండి..

Sukanya Samriddhi Yojana: గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గినట్లుగా కనిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా...

Sukanya Samriddhi Yojana: ప్రతీ రోజూ రూ. 100 రూపాయల్ సేవ్ చేయండి.. రూ. 15 లక్షలు పొందండి..
Money
Shiva Prajapati
|

Updated on: May 31, 2021 | 5:28 PM

Share

Sukanya Samriddhi Yojana: గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గినట్లుగా కనిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పొదుపు పథకాలపై వడ్డీలు భారీగా తగ్గుతున్నాయి. ఫలితంగా లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనాల్లో కోత ఏర్పడుతోంది. అయితే, కొన్ని పథకాల్లో వడ్డీ తగ్గినా.. ఇప్పటికీ చాలా పథకాలు సామాన్యులకు ప్రయోజం చేకూరుస్తున్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి కూడా లభిస్తోంది. ఈ పథకాల్లో డబ్బు పొదుపు చేయడం ద్వారా ఎటువంటి రిస్క్ లేకుండా కొన్ని సంవత్సరాల్లోనే మంచి రాబడిని పొందవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ పథకంలో ఇంట్లో ఆడపిల్లల పేరిట పెట్టుబడి పెట్టి.. నిర్ణీత కాల వ్యవధి ముగిశాక మంచి మెచ్యూరిటీని పొందవచ్చు.

అంతేకాదు.. ఈ పథకంలో పెట్టుబడి పెడితే వచ్చే మెచ్యూరిటీ సొమ్ముపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో మినహాయింపు కూడా ఉంటుంది. అయితే, ఈ పథకాన్ని కేవలం కూతుళ్లు ఉన్న వారు మాత్రమే సద్వినియోగం చేసుకోగలరు. మీకు కూడా కూతురు ఉన్నట్లయితే వారి భవిష్యత్ కోసం ఈ స్కీమ్‌లో పొదువు చేసుకోవడం చాలా ఉత్తమం. ప్రతీ రోజూ కేవలం రూ. 100 పొదుపు చేసినట్లయితే.. ప్లాన్ గడువు ముగిసిన తరువాత రూ. 15 లక్షల సొమ్ము లభిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్కీమ్ ఏంటి.. ఈ ప్రభుత్వం ఆడ బిడ్డల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని ప్రారంభించింది. సుకన్య సమృద్ధి యోజన పేరులో ప్రారంభించిన ఈ పథకంలో, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట పోస్ట్ ఆఫీస్‌లో బ్యాంక్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టే పెట్టుబడిపై వార్షిక వడ్డీ 7.6 శాతం చొప్పున లభిస్తుంది. ఈ పథకంలో డబ్బును 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది రాబోయే 6 సంవత్సరాల తరువాత అంటే 21 వ సంవత్సరంలో పూర్తవుతుంది. అయితే, ఈ 6 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

మీకు ఎంత సొమ్ము లభిస్తుంది? ఖాతాదారులు ప్రతిరోజూ 100 రూపాయలు పొదుపు చేసినట్లయితే.. ఏడాదికి అది 36 వేల 500 రూపాయలు అవుతోంది. 15 సంవత్సరాల కాలానికి అది కాస్తా రూ. 5,47,500 అవుతుంది. మెచ్చూరిటీ కాలానికి దీనిపై లబ్ధిదారులకు రూ. 10 లక్షల రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే స్కీమ్ ముగిసిన తరువాత లబ్ధిదారునికి రూ. 15,48,854 లు లభిస్తాయి. ఇది అమ్మాయి వివాహానికి గానీ, ఉన్నత చదువులకు గానీ ఉపకరిస్తుంది.

రూ. 500 రూపాయలతో ఖాతా ఓపెన్ చేయొచ్చు.. ఆడ పిల్లల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతగానో ఉపకిస్తుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను రూ. 250 తో ఓపెన్ చేయొచ్చు. అయితే, ఈ అకౌంట్‌లో కనీసం రూ. 500 డబ్బు నిల్వ ఉండాలి. కనీస బ్యాలెన్స్ లేకపోతే అది డిఫాల్ట్ ఖాతాగా పరిగణించబడుతుంది.

ఎక్కువ పెట్టుబడి పెడితే.. ఎక్కువ రాబడి పొందవచ్చు.. సంవత్సరానికి రూ .12500 నుంచి గరిష్టంగా రూ .1.50 లక్షలు పొదుపు చేయొచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా ఖాతాదారులు 14 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి 7.6% వడ్డీతో కలిపి 14 సంవత్సరాలలో ఈ మొత్తం 37,98,225 అవుతుంది. అయితే, ఈ 14 సంవత్సరాల గడువు తరువాత మరో 7 సంవత్సరాలు స్కీమ్ టైమ్ ఉంది. ఈ సమయంలో ఖాతాదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా 21 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి 7.6 శాతం వడ్డీతో ఖాతాదారులు రూ. 63,42,589 లబ్ధిపొందుతారు.

Also read:

Lockdown: నిబంధనలు పాటించాల్సిందే.. లాక్‌డౌన్‌లో బయటకు వస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌