ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్న తెలుగు భారీ బడ్జెట్ సినిమాలివే.! ఫ్యాన్స్‌కు పండగే పండగ..
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ ఎఫెక్ట్ నుంచి బయటపడి ఈ ఏడాది ఇండస్ట్రీ...
Tollywood Big Films: కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ ఎఫెక్ట్ నుంచి బయటపడి ఈ ఏడాది ఇండస్ట్రీ కోలుకుంటోందని అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ నడుస్తోంది. థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించట్లేదు. ఈ నేపధ్యంలో నిర్మాతలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీల రిలీజ్ అయిన విషయం విదితమే. త్వరలోనే భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఓటీటీ బాట పట్టనున్నట్లు సమాచారం. ఆ చిత్రాల్లో ఏంటో ఓసారి చూసేద్దాం..
వెంకటేష్ హీరోగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యం 2’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని టాక్. ఇంతకముందు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలను మేకర్స్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి సినిమాల విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుండటంతో చిత్ర నిర్మాతలు ఓటీటీతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాస్ట్రో’. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయాలని భావించగా.. కరోనా కారణంగా దానికి బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని బావిస్తున్నారట. అందుకు సంబంధించి ప్రముఖ ఓటీటీతో డీల్ కూడా మాట్లాడినట్లు సమాచారం.
ఇక యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన `పాగల్` చిత్రాన్ని కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. లాక్ డౌన్ కారణంగా రిలీజ్‌కు ఆలస్యం అవుతుండటంతో నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.