Superstar Krishna : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కృష్ణ.. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన సూపర్ స్టార్..
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ... చిన్న నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు.
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ… చిన్న నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా గతిని మార్చిన ఎన్నో సినిమాలకు కృష్ణ నాంది పలికారు. ఈరోజు (మే 31న) పుట్టిన రోజు. మహేష్ బాబు, కోడలు నమ్రత, మనవరాలు సితార సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కృష్ణ. తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. దీంతో ఈరోజు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా హీరో కృష్ణ గారు మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై బాధ్యత ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది తెలిపారు. నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.