‘బాహుబలి’ని బీట్ చేయనున్న ప్రభాస్ కొత్త సినిమా.. బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని నాగ్ అశ్విన్.. మరి అన్ని కోట్లా ?
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత ప్రభాస్ కు క్రేజ్ ఎలా మారిపోయిందో తెలిసిన విషయమే. ఈ సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా రీజినల్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ డమ్ సంపాదించాడు. టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. అటూ బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్.. ఇలా వరుసపెట్టి ఓ వైపు సినిమాలు చేస్తుండగానే.. మరోవైపు కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. యంగ్ రెబల్ స్టార్. ఈ మధ్యలోనే మహానటితో సెన్షేషనల్ హిట్ కొట్టిన సైలెంట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆడియెన్స్ మొదటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో వీరిద్ధరి కాంబోలో సినిమా రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వీరిద్ధరి మూవీపై ఓ అల్టిమేట్ రూమర్ వైరల్ అవుతుంది.
రోబో 2. ఓ తర్వాత.. మరోసారి అలాంటి టెక్నాలజీ బేస్డ్ మూవీని.. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వర్చువల్ వరల్డ్ గా మారుతున్న ప్రస్తుత ప్రపంచం.. అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఎలా ఉండనుందో తెరపై ఆవిష్కరించనున్నాడు. హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీగా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఓ హాలీవుడ్ టెక్నికల్ టీమ్ నే దించుతున్నారు. అయితే తొలుత అనుకున్న ప్రకారం.. రూ. 250 నుంచి రూ.300 కోట్లతో ఈ మూవీకి ప్యాకప్ చెప్పాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడా సరిపోవడం లేదని తెలుస్తుంది. ప్రభాస్ తో పాటు.. ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొనే, మరో 8 మంది బాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారు. దీంతో ఇందులో నటిస్తున్న వారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా..రూ. 200 కోట్లు దాటిందట. ఇందులో కేవలం ఒక్క ప్రభాస్ ఖాతాలో వంద కోట్లు పడనున్నాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో బాహుబలి మూవీకి కూడా ఈ లెవెల్లో ఖర్చు చేయలేదు. మరి అలాంటిది.. ఇప్పుడు రెమ్యునరేషన్స్ కే ఇంతఖర్చు చేయడంపై.. చర్చనీయాంశంగా మారింది. ఇటు రెమ్యునరేషన్, అటు వీఎఫ్ఎక్స్ కలిపితే.. మూవీ బడ్జెట్ రూ.600 కోట్లు దాటుతుందనే అంచనాకు వస్తున్నారు. దీంతో ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారట.