Road accident: రోడ్డుపై కారు డోర్‌ తీసేముందు చూసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. వైరల్‌ అవుతోన్న యాక్సిడెంట్‌ వీడియో!

కర్నాటకకు చెందిన రోడ్ సేఫ్టీ అధికారులు షేర్ చేసిన ఓ షాకింగ్‌ వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చూసుకోకుండా కారు డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలిపేందుకు ఓ హెచ్చరికగా దీనిని షేర్‌ చేస్తున్నట్లు..

Road accident: రోడ్డుపై కారు డోర్‌ తీసేముందు చూసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. వైరల్‌ అవుతోన్న యాక్సిడెంట్‌ వీడియో!
Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 11, 2022 | 7:16 PM

కర్నాటకకు చెందిన రోడ్ సేఫ్టీ అధికారులు షేర్ చేసిన ఓ షాకింగ్‌ వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చూసుకోకుండా కారు డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలిపేందుకు ఓ హెచ్చరికగా దీనిని షేర్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో కూర్చున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కారు డోర్‌ తెరుస్తాడు. వెనుక వైపు నుంచి స్కూటర్‌పై వస్తున్న మహిళా ప్రయాణికురాలు రాంగ్ సైడ్‌లో అకస్మాత్తుగా తెరుచుకున్న కారు డోర్‌ తగిలి రోడ్డుపై పడిపోతుంది. ఇంతలో వెనుకవైపు నుంచి వస్తున్న కారు టైర్ల కింద మహిళ పడిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఐతే సదరు మహిళకు ఏమైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోలో కన్పిస్తున్న టైం, తేదీలను బట్టి ఈ దుర్ఘటన సెప్టెంబర్‌ 24న జరిగినట్లు తెలుస్తోంది.

‘పబ్లిక్‌ రోడ్లపై కారు డోరు తెరిచే ముందు, వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ఉండండి’ అంటూ కర్ణాటక రాష్ట్ర రోడ్డు భద్రతా అథారిటీ తన ట్విటర్ ఖాతాలో ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇదే..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘కారు డోర్‌ తీసిన వ్యక్తిని అరెస్టు చెయ్యాలి’. ‘కారు డోర్ తెరిచే ముందు వెనుక ఏదైనా వాహనం వస్తుందో.. లేదో.. అద్దంలో చెక్‌ చేసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. దురృష్టవశాత్తు చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని పలువురు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను తెలిపారు.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..