ఎంతకూ తెగించాడు.. చివరికి ఆవును కూడా వదల్లేదు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నిందితుడు..!

దేశంలో మూగజీవాల పట్ల అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఓ నీచుడు ఆవును కూడా వదల్లేదు. అత్యంత పాశవికంగా, అసభ్యంగా ప్రవర్తించాడు.

ఎంతకూ తెగించాడు.. చివరికి ఆవును కూడా వదల్లేదు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నిందితుడు..!
Arrested
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2024 | 6:27 PM

పశ్చిమ బెంగాల్‌లో అత్యంత అసభ్యకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. పశ్చిమ మిడ్నాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆవుతో అసభ్యకర పనులు చేస్తూ దొరికిపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని సబాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో మోతీ ఘాటా అనే 30 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గురువారం మిడ్నాపూర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు జంతు ప్రేమికులు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం తక్షణమే అవగాహన కల్పించాలని డిమాండ్‌ చేశారు. భారతదేశంలో, జంతువులతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే, పోలీసులు IPC సెక్షన్ 377 కింద కేసు నమోదు చేస్తారు. సెక్షన్ 377 కింద అభియోగం రుజువైతే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మరోవైపు, ఇటువంటి చర్యలు పారాఫిలియా, మృగత్వం అని పిలువబడే అసాధారణ మానసిక రుగ్మత అని మానసిక వైద్యులు అంటున్నారు. ఈ రుగ్మతలో, వ్యక్తి జంతువులతో సంబంధాలను ఏర్పరుచుకునే ధోరణిని కలిగి ఉంటాడంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..