AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Card: శుభలేఖ తెచ్చిన తిప్పలు.. ఆగిపోయిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే..?

పెళ్లి పత్రికే కొంప ముంచింది. ఇద్దర్ని కలిపేందుకు ఉపయోగపడే కార్డు కాస్తా....ఆ పెళ్లి రద్దు కావడానికి దోహదపడింది. మహారాష్ట్ర నాసిక్‌లోని మ‌తాంత‌ర వివాహానికి సంబంధించిన...

Wedding Card: శుభలేఖ తెచ్చిన తిప్పలు.. ఆగిపోయిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే..?
WEDDING
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2021 | 9:38 AM

Share

పెళ్లి పత్రికే కొంప ముంచింది. ఇద్దర్ని కలిపేందుకు ఉపయోగపడే కార్డు కాస్తా….ఆ పెళ్లి రద్దు కావడానికి దోహదపడింది. మహారాష్ట్ర నాసిక్‌లోని మ‌తాంత‌ర వివాహానికి సంబంధించిన పెళ్లికార్డు పెద్ద సంచ‌ల‌న‌ం సృష్టించింది. ఈ వివాహం ల‌వ్ జిహాద్ అంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్యక్తం కావ‌డంతో… వధువు కుటుంబం పెళ్లి వేడుక‌ల‌ను ర‌ద్దుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌కు చెందిన ప్రసాద్ అద్గాంక‌ర్ స్వర్ణకారుడు. ఈయనకు రశిక అనే పేరు గల  కూతురు ఉంది. ఆమె దివ్యాంగురాలు కావడంతో సంబంధాలు ఎన్ని తెచ్చినా ముడిపడలేదు. చివరికి ర‌శిక త‌న క్లాస్‌మేట్ అయిన ఆసిఫ్ ఖాన్‌ను ఇష్టప‌డింది. అతను కూడా ఆమెను ఇష్టపడ్డాడు. ఇద్దరికి ఇష్టం కావడంతో పెద్దలు కూడా మతాలను పక్కనపెట్టి ఇద్దరికీ పెళ్లి చేయాల‌ని నిర్ణయించారు. నాసిక్‌లోని స్థానిక న్యాయ‌స్థానంలో వీరి వివాహ విష‌యాన్ని ఈ ఏడాది మే నెల‌లోనే న‌మోదు చేశారు.

జులై 18న వివాహ వేడుక‌ల‌ను జ‌ర‌పాల‌ని ప్రసాద్ కుటుంబం భావించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది. నాసిక్‌లోని ఓ హోట‌ల్‌లో మ్యారేజ్‌ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వీరిద్దరి పెళ్లి పత్రిక వాట్సాప్‌ గ్రూప్ ద్వారా చాలా మందికి చేరడంతో ఇది ఖచ్చితంగా ల‌వ్ జిహాద్ అంటూ వివాదం రేగింది. దీనిపై అనేక నిర‌స‌న‌లు, నెగెటివ్ కామెంట్స్‌ వెల్లువెత్తాయి. యువతిని బలవంతంగా వేరే మతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే ప్రచారం జరిగింది. పెళ్లి ఆపాలంటూ బెదిరింపు కాల్స్ కూడా రావడంతో పెళ్లి కుమార్తె తండ్రి వివాహం రద్దు చేసుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే అమ్మాయితో ఎలాంటి బంధుత్వం లేని వాళ్లు ఈ పెళ్లిని ఆపడానికి ప్రధాన కారణమయ్యారు.

Also Read:అంగన్వాడీ బియ్యం కల్తీ..! నానబెట్టిన కొద్దిసేపటికే… పైకి తేలిన రైస్

 ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం