బెంగాల్ సీఎం మమతా ముఖర్జీ ఎన్నిక కోసం..ఢిల్లీలో ఈసీతో భేటీ కానున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిబృందం
బెంగాల్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ తో భేటీ కానుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు..
బెంగాల్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ తో భేటీ కానుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆమెకు ఈ ఉప ఎన్నికలు ఎంతో కీలకం.. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మినిస్టీరియల్ పదవిని పొందాలంటే ఆరు నెలల్లోగా రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటుకు ఎన్నికై ఉండాలి. మమత ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే నవంబరు 4 లోగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేదా ఆమె ఈ పదవిని కోల్పోతారు. అందువల్లే ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని తాము ఈసీని కోరనున్నామని టీఎంసీ ఎంపీలుతెలిపారు. .
సీనియర్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ నేతృత్వంలో ఈ బృందం ఎన్నికల సంఘంతో భేటీ కానుంది. ఈసీ కావాలనే ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నిర్వహణపై జాప్యం చేస్తోందని రాజ్యసభలో ఈ పార్టీ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రే ఆరోపించారు. దేశంలో థర్డ్ కోవిడ్ వేవ్ వచ్చేంతరవరకు వెయిట్ చేద్దామనుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గాయని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఈ ఎన్నికలను నిర్వహించాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. భవానీపూర్, దిన్ హట, శాంతిపూర్, ఖర్దా, గోసబ, షంషేర్ గంజ్, జంగిపూర్ నియోజకవర్గాలకు బైపోల్స్ జరగాల్సి ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల అభ్యర్థులు మరణించడమో, ఈ స్థానాలకు రాజీనామా చేయడమో జరిగింది. భవానీపూర్ నుంచి మమత పోటీ చేసేందుకు వీలుగా అక్కడ అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ కు వెళ్లిన చిరుతపులి..అధికారులకు 4 గంటల రెస్క్యూ.. వైరల్ అవుతున్న వీడియో..:Leopard In School Video.