మీ అభినందనలు మా హృదయాన్ని తాకాయి.. సాయుధ దళాలకు డాక్టర్ల కృతజ్ఞత

కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు సంఘీభావంగా... అభినందన సూచకంగా భారత వైమానిక దళ జెట్ విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. ఆసుపత్రుల బయట సామాజిక దూరాన్ని పాటిస్తూ నిలబడిన  వేలాది వైద్య సిబ్బంది...

మీ అభినందనలు మా హృదయాన్ని తాకాయి.. సాయుధ దళాలకు డాక్టర్ల కృతజ్ఞత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 03, 2020 | 4:55 PM

కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు సంఘీభావంగా… అభినందన సూచకంగా భారత వైమానిక దళ జెట్ విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. ఆసుపత్రుల బయట సామాజిక దూరాన్ని పాటిస్తూ నిలబడిన  వేలాది వైద్య సిబ్బంది తమకు లభించిన ఈ అపూర్వ గౌరవానికి పొంగిపోయారు.  అనేక చోట్ల మిలిటరీ బ్యాండు మేళాలు కూడా మోగాయి. ఇది తమకెంతో సంతోషాన్ని కలిగించిందని వైద్య సిబ్బంది వ్యాఖ్యానించారు. సాయుధ దళాల నుంచి ఇంతటి గౌరవం లభిస్తుందని తాము అనుకోలేదని వీరన్నారు. రాయ పూర్ లోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నితిన్ నగర్కర్, ఢిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి డాక్టర్లు, ముంబైలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి, ఇంకా  దేశంలోని పలు ఆస్పత్రుల సిబ్బంది ప్రధాని మోదీకి, సైనిక దళాలకు  కృతజ్ఞతలు తెలిపారు. రోగులకు సేవలు అందించడం తమ బాధ్యత అని వినమ్రంగా పేర్కొన్నారు.