‘మీ త్యాగ నిరతి మరువలేనిది’.. హంద్వారా ఘటనపై ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా లో టెర్రరిస్టుల చేతిలో అయిదుగురు భద్రతా సిబ్బంది మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి త్యాగాన్ని మరువలేమని ట్వీట్ చేశారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా లో ఉగ్రవాదుల దాడిలో....

  • Umakanth Rao
  • Publish Date - 4:26 pm, Sun, 3 May 20
'మీ త్యాగ నిరతి మరువలేనిది'..  హంద్వారా ఘటనపై ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా లో టెర్రరిస్టుల చేతిలో అయిదుగురు భద్రతా సిబ్బంది మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి త్యాగాన్ని మరువలేమని ట్వీట్ చేశారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు, ఒక పోలీసు మరణించారు.శనివారం సాయంత్రం మొదలైన ఈ ఆపరేషన్ రాత్రి పొద్దుపోయేవరకు కొనసాగింది. ఆర్మీ చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్ ఉన్నారు. అటు-రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వీరికి నివాళులర్పించారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.