Watch Video: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం.. ప్రయాణీకులందరూ సురక్షితం
Mumbai Airport Fire Incidnet: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ టీ2లో శనివారం వేకువజామున తేలికపాటి అగ్ని ప్రమాదం సంభవించినట్లు..

Mumbai Airport Fire Accident: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2 వెలుపల శనివారం వేకువజామున తేలికపాటి అగ్ని ప్రమాదం సంభవించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకాతిక కారణాలతో క్యాబ్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పారు. ఈ అగ్ని ప్రమాద ఘటనతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. మంటలను వెంటనే ఆర్పేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ తేలికపాటి అగ్ని ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని విమానాశ్రయ అధికార వర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై విమానాశ్రయంలో మంటల్లో తగలబడుతున్న క్యాబ్..
Early morning scene at T2 Mumbai Airport today. One car due to its technical issue got gutted to fire in minutes. Thankfully, no human damage….. pic.twitter.com/eF6es2UTE7
— 31YrsOfHorrificKashmiriPanditExodus (@KaulSunil) November 13, 2021
Also Read..
Cinema News: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే మరక్కర్.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం