Watch: చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి.. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును ప్రకటించకముందే భారత్ త్వరపడాలంటున్న స్వామి చక్రపాణి..
చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు ప్రధాని మోడీకి చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు. స్వామి చక్రపాణి ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని గురించి చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా 'శివశక్తి పాయింట్'గా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకుండా చర్యలు చేపట్టాలని వీడియోలో పేర్కొన్నారు.
చంద్రుడిపై ఇతర దేశాలు తమ ఆధిపత్యాన్ని ప్రకటించే లోపే, భారత్ త్వరపడాలని, చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు, ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును చాటుకునే లోపే చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని సూచించారు. ఇవీ హిందూ ధర్మకర్త, విపరీతమైన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలైన స్వామి చక్రపాణి మహారాజ్ అసాధారణ డిమాండ్లు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు ప్రధాని మోడీకి చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు. స్వామి చక్రపాణి ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని గురించి చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా ‘శివశక్తి పాయింట్’గా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకుండా చర్యలు చేపట్టాలని వీడియోలో పేర్కొన్నారు.
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान “शिव शक्ति पॉइंट” को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए 🌸🙏🌸स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023
అంతేకాదు, చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించిన అనంతరం ఈ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కూడా పేర్కొన్నారు. కాగా, స్వామి చక్రపాణి మహరాజ్ గతంలోనూ తన వింత వ్యాఖ్యలతో కలకలం రేపారు. కొవిడ్ తొలి వేవ్ సమయంలో గోమూత్ర పార్టీ నిర్వహించి సంచలనం సృష్టించారు. అతని తోటి అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు వ్యాధిని నివారించడానికి ఆవు మూత్రం తాగారు.
2018లో కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సమయంలో స్వామి చక్రపాణి రాష్ట్రంలో గొడ్డు మాంసం తినే వారికి ఎలాంటి సహాయం అందకూడదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఈ సంవత్సరం ప్రారంభంలో హిందూ మతాన్ని అవమానించే బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్ మ్యూజిక్ వీడియోలు మొదలైనవాటిలోని కంటెంట్‌ను పర్యవేక్షించడానికి “ధర్మ సెన్సార్ బోర్డు”ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..