Bank Holiday: బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ రోజు నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవు..
Bank Holiday: రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు బ్యాంకులో పని ఉంటే ఈ వార్త చాలా ముఖ్యం. ఎందుకంటే
Bank Holiday: రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు బ్యాంకులో పని ఉంటే ఈ వార్త చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు నేరుగా సెప్టెంబర్‌లో తెరుచుకుంటాయి. అందువల్ల ఒక్కసారి బ్యాంకుకు వెళ్లేముందు సెలవుల జాబితాను పరిశీలించండి. ప్రస్తుతం ఆగస్టు చివరి వారం నడుస్తోంది. రాబోయే రెండు రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు ఉన్నాయి. ఈ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆగస్టు నెలలో చాలా పండుగలు ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ బ్యాంకులపై పడుతుంది.
బ్యాంకు నాలుగు రోజులు సెలవు ఎందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఆగష్టు 28 నుంచి ఆగస్టు 31 వరకు బ్యాంకులు మూసివేస్తారు. ఆగష్టు 28 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూసివేస్తారు. ఆదివారం కారణంగా ఆగస్టు 29 న సెలవు ఇది వారాంతపు సెలవు. ఆగష్టు 30న కూడా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఆగష్టు 31న మూసి ఉంటాయి. ఎందుకంటే శ్రీ కృష్ణాష్టమి-2021 కొన్ని ప్రాంతాల్లో 30వ తేదీన, మరికొన్ని ప్రాంతాల్లో 31వ తేదీన నిర్వహిస్తు్న్నారు. అందువల్ల బ్యాంకులు నేరుగా సెప్టెంబర్ 1 న తెరుచుకుంటాయి.
ATM నుంచి నగదు ఉపసంహరించుకోండి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే లావాదేవీలకు ఎటువంటి సమస్య రాదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు 24 గంటలూ పనిచేస్తాయి. మీరు ఆన్‌లైన్ ద్వారా ఏ పనినైనా పూర్తి చేయవచ్చు. అయితే మీకు నగదు కావాలంటే మాత్రం ఈ రోజే ఏటీఎంకు వెళ్లండి. ఎందుకంటే బ్యాంకుల మూసివేత కారణంగా ATM లలో నగదు కొరత ఏర్పడవచ్చు.