Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇక నుంచి ఏసీ కోచ్‌లో ప్రయాణం చాలా చౌక..

Indian Railway: ఇండియన్‌ రైల్వే సెప్టెంబర్‌లో స్పెషల్‌ ఎకానమీ AC 3-టైర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందులో ధరలు

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇక నుంచి ఏసీ కోచ్‌లో ప్రయాణం చాలా చౌక..
Railway Coach
Follow us

|

Updated on: Aug 28, 2021 | 7:32 AM

Indian Railway: ఇండియన్‌ రైల్వే సెప్టెంబర్‌లో స్పెషల్‌ ఎకానమీ AC 3-టైర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందులో ధరలు AC 3-టైర్ కంటే 8 శాతం తక్కువగా నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. ఈ స్పెషల్‌ కోచ్‌లు స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం ఉద్దేశించినవి కాబట్టి సాధారణ AC 3-టైర్ ఛార్జీ కంటే తక్కువగా ఉండాలి అలాగే స్లీపర్ క్లాస్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే 300 కి.మీ వరకు బేస్ ఛార్జీ రూ.440 ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది దూరం పరంగా అతి తక్కువ. అయితే అత్యధిక బేస్ ఛార్జీ 4,951 నుంచి 5,000 కిమీలకు రూ.3,065 ఉండనున్నట్లు సమాచారం. ప్రయాగరాజ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మొదటి ఎకానమీ ఏసీ త్రీటైర్ కోచ్ స్పెషల్ అమర్చారని తెలిపారు.

రైల్వే ప్రణాళిక ప్రకారం.. ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దాదాపు 806 కొత్త కోచ్‌లను సిద్ధం చేయాలని రైల్వే భావిస్తోంది. ఇవి ఉత్తమ AC ప్రయాణాన్ని అత్యంత సరసమైన ధరలలో అందిస్తాయి. 2021 లేదా 2022 చివరి నాటికి మనకు 806 AC 3-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కోచ్‌ల తయారీకి రైల్వే ఫ్యాక్టరీలన్నీ కలిసి పనిచేస్తాయని గతంలో రైల్వే అధికారులు చెప్పారు. ఇండియన్‌ రైల్వే ప్రయాణికులందరికి మునుపెన్నడూ లేని అనుభవాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంది.

అయితే AC, ఛార్జీలు ఈ కోచ్‌లలో అత్యుత్తమ ఫీచర్లు కావు. ఎందుకంటే ఈ కోచ్‌లలో మెరుగైన డిజైన్, ప్రతి బెర్త్ కోసం స్పెషల్‌ AC వెంట్‌, సీట్ల మాడ్యులర్ డిజైన్, వ్యక్తిగత రీడింగ్ పాయింట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మరిన్ని వాటిని అమర్చుతున్నారు. అంతేకాదు రెగ్యులర్ AC కోచ్‌లతో పోలిస్తే కొత్తగా డిజైన్ చేసిన కోచ్‌లలో బెర్తుల సంఖ్య 15 శాతం పెరిగింది. అయితే ఇవి ప్రయాణికులను ఎంతవరకుఆకట్టుకుంటాయో చూడాలి.

Free Internet: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఫ్రీ ఇంటర్నెట్‌.. ఉచిత సేవలను ఇలా పొందండి. యాక్ట్‌ యూజర్లకు ప్రత్యేకంగా..

Chanakya Niti: పాలకులకు.. మిత్రుడు అంటే ఎవరు.. ఎవరితో స్నేహం చేయాలో చెప్పిన చాణక్య..

Gold Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరోసారి పెరిగిన ధరలు..